
ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లల జననం...!
పార్వతీపురం: పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో ఓ గిరిజన మహిళ ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. మక్కువ మండలం విజయరామపురం గ్రామానికి చెందిన సీదారపు కుంబమ్మ అనే మహిళ సోమవారం ప్రసవానికి ఆస్పత్రిలో చేరింది. తొలుత ఇద్దరు పాపలకు జన్మనిచ్చిన ఆమె, తరువాత మూడో పాపకు కూడా జన్మనిచ్చింది. అయితే అప్పటికే కడుపులో ఆ పాప చనిపోయింది. కుంబమ్మ తొలి కాన్పు నార్మల్ డెలివిరీలో ఒక బాబుకు జన్మనీయగా, రెండో కాన్పులో కూడా నార్మల్ డెలివిరీలో ముగ్గురు పాపలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఇద్దరు పాపలు, తల్లీ క్షేమంగానే ఉన్నారు.