Priyanka Gandhi Vadra danced with tribal women in Goa: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఇటీవలే గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ఆమె మొర్పిర్ల గ్రామంలో గిరిజన మహిళలతో కలిసి జానపద నృత్యం చేశారు. అంతేకాదు ప్రియాంక గాంధీ ఎర్రటి చీరను ధరించి ధోల్ దరువులకు అనుగుణంగా గిరిజన మహిళల మాదిరి తలపై కుండ పెట్టుకుని డ్యాన్స్ చేశారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు.
(చదవండి: ఒంటెల అందాల పోటీలు!.... 40కి పైగా ఒంటెలకు అనర్హత వేటు!!)
పైగా ఆమె మోర్పిర్ల గ్రామంలోని బలమైన ఆత్మవిశ్వాసం కలిగిన గిరిజన మహిళలు గోవాలో పర్యావరణ పరిరక్షణ పచ్చదనాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్నారు అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింత తెగ వైరల్ అవుతుంది. అయితే అధికార పార్టీ బీజేపీ ఐటీ సెల్ ఇన్‌చార్జ్ అమిత్ మాల్వియా యావత్తు దేశం తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ చీఫ్ జనరల్ రావత్ మృతితో శోక సంద్రంలో ఉంటే మీరు గిరిజన మహిళలతో డ్యాన్స్‌లు చేస్తున్నారా అంటూ ప్రియాంక గాంధీ పై విమర్శలు ఎక్కుపెట్లారు.
(చదవండి: పక్షిలా షి‘కారు’)
Smt. @priyankagandhi joins the tribal women of Morpirla village during a phenomenal performance of their folk dance.#PriyankaGandhiWithGoa pic.twitter.com/p0ae6mKM9x
— Congress (@INCIndia) December 10, 2021
Comments
Please login to add a commentAdd a comment