దెవాస్: వివాహితను అడవుల్లోకి లాక్కుపోయి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ లోని బారిజాషిలో చోటుచేసుకుంది. బాగ్లీ-పంజాపూర్ రహదారిలో ఈ దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని దుండగులు 25 ఏళ్ల వివాహితను అపహరించి ఈ ఘాతుకానికి ఒడిగట్టారని వెల్లడించారు.
తనపై జరిగిన దారుణాన్ని వెల్లడించేందుకు బాధితురాలు అడవి నుంచి రోడ్డుపైకి వచ్చేందుకు ప్రయత్నించగా ఆమె తేనెటీగలు దాడి చేయడం విషాదమని పోలీసులు తెలిపారు. బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మిగతావారి కోసం గాలిస్తున్నారు.
అడవుల్లోకి లాక్కెళ్లి మహిళపై గ్యాంగ్ రేప్
Published Wed, Jun 18 2014 1:53 PM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM
Advertisement
Advertisement