అనారోగ్యంతో చిరుత.. గ్రామస్థుల ఆకతాయి చేష్టలు! | Watch: Sick Leopard Wanders Into Madhya Pradesh Village, Locals Fiercely Harassed Video Viral - Sakshi
Sakshi News home page

Madhya Pradesh Sick Leopard Video: ‘ఏం మనుషులు వీళ్లసలు’.. గాయపడిన చిరుతతో ఆటలు, రైడ్ చేసే యత్నం!

Published Wed, Aug 30 2023 11:51 AM | Last Updated on Wed, Aug 30 2023 12:23 PM

Video: Sick Leopard Wanders Into Madhya Pradesh Village - Sakshi

భోపాల్‌: మధ్య ప్రదేశ్‌లోని ఓ గ్రామ శివారులోకి చిరుతపులి ప్రవేశించింది. మొదట చిరుతను చూసి భయపడిన జనాలు.. అది ఆవేశంగా, హుషారుగా కనిపించకపోవడంతో ఆశ్యర్యపోయారు. తరువాత దాని దగ్గరకు వెళ్లి పరీక్షించగా.. సదరు చిరుత అనారోగ్యానికి గురైనట్లు తెలుసుకొని దానికి పెంపుడు జంతువుగా చూస్తూ ఆటపట్టించారు. దీనికి సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

దేవాస్‌ జిల్లా ఇక్లేరా సమీపంలోని అడవిలో చిరుత సంచరిస్తూ కనిపించింది. దాన్ని చూసి బెంబేలెత్తిన గ్రామస్తులు దూరంగా పారపోయేందుకు ప్రయత్నించారు. అయితే కొద్దిసేపటికి చిరుత దూకుడుగా లేకుండా నీరసంగా ఉండటం చూసి అది అస్వస్థతకు గురైనట్లు అర్థమైంది. దీంతో గ్రామస్థులు చిరుతపులి చుట్టూ చేరి దానితో ఆడుకోవడం ప్రారంభించారు. పెంపుడు జంతువులా చూస్తూ దానితో సెల్ఫీలు తీసుకున్నారు. కొంతమంది  అయితే చిరుతపై ఎక్కి రైడ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించారు.
చదవండి: ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ..

ఈ విషయాన్ని ఓ గ్రామస్తుడు అటవీశాఖకు సమాచారం అందించాడు. అధికారులు వచ్చే వరకు కూడా కొంతమంది ఆగకుండా దాన్ని చంపాలని నిర్ణయించుకున్నారు. అయితే ఉజ్జయిని నుంచి రెస్క్యూ టీం ఇక్లెరాకు చేరుకుని చిరుతను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. రెండేళ్ల చిరుతపులిని చికిత్స నిమిత్తం భోపాల్‌లోని వాన్ విహార్‌కు తీసుకెళ్లినట్లు అటవీ అధికారి సంతోష్ శుక్లా తెలిపారు. దానికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించినట్లు పేర్కొన్నారు. అయితే తీవ్ర అనారోగ్యంతో ఉన్న చిరుతపులిని ప్రజలు ఇబ్బంది పెట్టారని ఆయన అన్నారు 

చిరుత  సరిగ్గా నడవలేని స్థితిలో అడవిలో సంచరిస్తుందని ఫారెస్ట్ గార్డు జితేంద్ర చౌహాన్ తెలిపారు. దానికి వాన్‌విహార్‌లో చికిత్స అందిస్తున్నామని, పూర్తిగా కోలుకునే అవకాశం ఉందన్నారు. ఇక గ్రామస్థులు చిరుతతో ఆడుకుంటున్న వీడియో నెట్టింట్లో వైర్‌గా మారడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘అభివృద్ధి ముసుగులో ఇప్పటికే వాటి(జంతువుల) స్థలాలను ఆక్రమిస్తున్నాం.  ఇప్పుడు వాటిని కూడాఇబ్బంది పెడుతున్నాం. మనుషులుగా మనం సిగ్గుపడాలి’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement