Dewas
-
అనారోగ్యంతో చిరుత.. గ్రామస్థుల ఆకతాయి చేష్టలు!
భోపాల్: మధ్య ప్రదేశ్‌లోని ఓ గ్రామ శివారులోకి చిరుతపులి ప్రవేశించింది. మొదట చిరుతను చూసి భయపడిన జనాలు.. అది ఆవేశంగా, హుషారుగా కనిపించకపోవడంతో ఆశ్యర్యపోయారు. తరువాత దాని దగ్గరకు వెళ్లి పరీక్షించగా.. సదరు చిరుత అనారోగ్యానికి గురైనట్లు తెలుసుకొని దానికి పెంపుడు జంతువుగా చూస్తూ ఆటపట్టించారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేవాస్ జిల్లా ఇక్లేరా సమీపంలోని అడవిలో చిరుత సంచరిస్తూ కనిపించింది. దాన్ని చూసి బెంబేలెత్తిన గ్రామస్తులు దూరంగా పారపోయేందుకు ప్రయత్నించారు. అయితే కొద్దిసేపటికి చిరుత దూకుడుగా లేకుండా నీరసంగా ఉండటం చూసి అది అస్వస్థతకు గురైనట్లు అర్థమైంది. దీంతో గ్రామస్థులు చిరుతపులి చుట్టూ చేరి దానితో ఆడుకోవడం ప్రారంభించారు. పెంపుడు జంతువులా చూస్తూ దానితో సెల్ఫీలు తీసుకున్నారు. కొంతమంది అయితే చిరుతపై ఎక్కి రైడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించారు. చదవండి: ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ.. VIDEO | Rescue operation underway by forest officials in Madhya Pradesh’s Iklera village after a leopard was found by locals in a dazed state. “A team from Ujjain is reaching to capture the leopard and the animal will be shifted based on the directions of the higher officials,”… pic.twitter.com/NHpS0f1Mx6 — Press Trust of India (@PTI_News) August 30, 2023 ఈ విషయాన్ని ఓ గ్రామస్తుడు అటవీశాఖకు సమాచారం అందించాడు. అధికారులు వచ్చే వరకు కూడా కొంతమంది ఆగకుండా దాన్ని చంపాలని నిర్ణయించుకున్నారు. అయితే ఉజ్జయిని నుంచి రెస్క్యూ టీం ఇక్లెరాకు చేరుకుని చిరుతను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. రెండేళ్ల చిరుతపులిని చికిత్స నిమిత్తం భోపాల్‌లోని వాన్ విహార్‌కు తీసుకెళ్లినట్లు అటవీ అధికారి సంతోష్ శుక్లా తెలిపారు. దానికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించినట్లు పేర్కొన్నారు. అయితే తీవ్ర అనారోగ్యంతో ఉన్న చిరుతపులిని ప్రజలు ఇబ్బంది పెట్టారని ఆయన అన్నారు చిరుత సరిగ్గా నడవలేని స్థితిలో అడవిలో సంచరిస్తుందని ఫారెస్ట్ గార్డు జితేంద్ర చౌహాన్ తెలిపారు. దానికి వాన్‌విహార్‌లో చికిత్స అందిస్తున్నామని, పూర్తిగా కోలుకునే అవకాశం ఉందన్నారు. ఇక గ్రామస్థులు చిరుతతో ఆడుకుంటున్న వీడియో నెట్టింట్లో వైర్‌గా మారడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘అభివృద్ధి ముసుగులో ఇప్పటికే వాటి(జంతువుల) స్థలాలను ఆక్రమిస్తున్నాం. ఇప్పుడు వాటిని కూడాఇబ్బంది పెడుతున్నాం. మనుషులుగా మనం సిగ్గుపడాలి’ అంటూ కామెంట్ చేస్తున్నారు. -
దేవాస్‌కు 8,939 కోట్లివ్వండి
వాషింగ్టన్: శాటిలైట్ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసినందుకు గాను బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ దేవాస్ మల్టీమీడియాకు రూ.8,939.79 కోట్ల(1.2 బిలియన్ డాలర్లు) నష్ట పరిహారం చెల్లించాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వాణిజ్య విభాగమైన యాంట్రిక్స్ కార్పొరేషన్‌ను అమెరికా న్యాయస్థానం ఆదేశించింది. 2005 జనవరిలో ఈ ఒప్పందం కుదిరింది. 70 మెగాహెట్జ్ ఎస్–బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను దేవాస్ మల్టీమీడియాకు అందించేందుకు రెండు ఉపగ్రహాలను నిర్మించి, ప్రయోగించి, నిర్వహిస్తామని యాంట్రిక్స్ కార్పొరేషన్ హామీ ఇచ్చింది. అయితే, ఒప్పందం మేరకు స్పెక్ట్రమ్‌ను దేవాస్‌కు ఇవ్వడంలో యాంట్రిక్స్ కార్పొరేషన్ విఫలమైంది. 2011 ఫిబ్రవరిలో ఒప్పందాన్ని యాంట్రిక్స్ రద్దు చేసింది. అనంతరం దేవాస్ భారత్‌లో పలు కోర్టులను ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో సైతం పిటిషన్ దాఖలు చేసింది. తమకు న్యాయం చేయాలని విన్నవించింది. సరైన స్పందన లేకపోవడంతో 2018లో అమెరికాలోని వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వాషింగ్టన్ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి థామస్ ఎస్.జిల్లీ అక్టోబర్ 27న ఉత్తర్వు జారీ చేశారు. దేవాస్ సంస్థకు 562.5 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని, ఇప్పటిదాకా వడ్డీతో కలిపి రూ.8,939.79 కోట్ల(1.2 బిలియన్ డాలర్లు)ను దేవాస్ మల్టీమీడియాకు చెల్లించాలని యాంట్రిక్స్ కార్పొరేషన్‌కు తేల్చిచెప్పారు. -
కొంప ముంచిన ‘గానాబజానా’
భోపాల్: కార్యాలయాన్ని పబ్‌లా మార్చేసిన ఇద్దరు మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులపై వేటు పడింది. పని ఎగ్గొట్టి కార్యాలయంలో డాన్సులు చేసిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ దివాస్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అసలేం జరిగింది? మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన ఉద్యోగులు ఏప్రిల్ 13న జిల్లా కార్యాలయంలో బాలీవుడ్ పాటలకు ఉత్సాహంగా డాన్సులు చేశారు. కజరారే.. కజరారే అంటూ మస్త్ మజా చేశారు. జిల్లా ప్రోగ్రామ్ అధికారి సునీత్ యాదవ్, నగర దక్షిణ ప్రాజెక్టు అధికారి ప్రియాంక జైశ్వాల్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా నృత్యాలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టడంతో వీరి బాగోతం బయటపడింది. వేటు పడింది దీనిపై స్పందించిన కలెక్టర్ ఆశిష్ సింగ్ చర్యలు చేపట్టారు. అసిస్టెంట్ (గ్రేడ్ 2) దివాకర్ రోజస్కార్, సూపర్వైజర్ స్నేహా శర్మలను సస్పెండ్ చేశారు. వీరితో కలిసి డాన్స్ చేసిన ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. అయితే కేక్ కోసిన తర్వాత యాదవ్, జైశ్వాల్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. అనంతరం దివాకర్, స్నేహ బృందం గానాబజానా మొదలుపెట్టిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. -
అడవుల్లోకి లాక్కెళ్లి మహిళపై గ్యాంగ్ రేప్
దెవాస్: వివాహితను అడవుల్లోకి లాక్కుపోయి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ లోని బారిజాషిలో చోటుచేసుకుంది. బాగ్లీ-పంజాపూర్ రహదారిలో ఈ దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని దుండగులు 25 ఏళ్ల వివాహితను అపహరించి ఈ ఘాతుకానికి ఒడిగట్టారని వెల్లడించారు. తనపై జరిగిన దారుణాన్ని వెల్లడించేందుకు బాధితురాలు అడవి నుంచి రోడ్డుపైకి వచ్చేందుకు ప్రయత్నించగా ఆమె తేనెటీగలు దాడి చేయడం విషాదమని పోలీసులు తెలిపారు. బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మిగతావారి కోసం గాలిస్తున్నారు.