డాన్స్ చేస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులు
భోపాల్: కార్యాలయాన్ని పబ్‌లా మార్చేసిన ఇద్దరు మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులపై వేటు పడింది. పని ఎగ్గొట్టి కార్యాలయంలో డాన్సులు చేసిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ దివాస్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
అసలేం జరిగింది?
మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన ఉద్యోగులు ఏప్రిల్ 13న జిల్లా కార్యాలయంలో బాలీవుడ్ పాటలకు ఉత్సాహంగా డాన్సులు చేశారు. కజరారే.. కజరారే అంటూ మస్త్ మజా చేశారు. జిల్లా ప్రోగ్రామ్ అధికారి సునీత్ యాదవ్, నగర దక్షిణ ప్రాజెక్టు అధికారి ప్రియాంక జైశ్వాల్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా నృత్యాలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టడంతో వీరి బాగోతం బయటపడింది.
వేటు పడింది
దీనిపై స్పందించిన కలెక్టర్ ఆశిష్ సింగ్ చర్యలు చేపట్టారు. అసిస్టెంట్ (గ్రేడ్ 2) దివాకర్ రోజస్కార్, సూపర్‌వైజర్ స్నేహా శర్మలను సస్పెండ్ చేశారు. వీరితో కలిసి డాన్స్ చేసిన ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. అయితే కేక్ కోసిన తర్వాత యాదవ్, జైశ్వాల్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. అనంతరం దివాకర్, స్నేహ బృందం గానాబజానా మొదలుపెట్టిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment