గోండా: ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. పదిహేనేళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఖరగ్పూర్ ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. తన పొలాల్లో పశువులను కాసేందుకు బాలిక వెళ్లగా ఇద్దరు యువకులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.
స్పృహ కోల్పోయిన స్థితిలో బాలికను గుర్తించిన గ్రామస్థులు సమాచారం వెంటనే తమకు అందించారని, ఆ బాలికను ఆస్పత్రిలో చేర్పించి వైద్యం ఇప్పిస్తున్నామని అఖండ్ ప్రతాప్ సింగ్ అనే పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. దర్యాప్తు వేగంగా జరపుతున్నామని, నిందితులను వెంటనే అరెస్టు చేస్తామని చెప్పారు.
పదిహేనేళ్ల బాలికపై లైంగిక దాడి
Published Sun, Sep 13 2015 11:52 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM
Advertisement
Advertisement