మార్నింగ్ వాక్కు వెళ్తే.. సామూహిక అత్యాచారం | 26 year old gangraped by five youths | Sakshi
Sakshi News home page

మార్నింగ్ వాక్కు వెళ్తే.. సామూహిక అత్యాచారం

Published Sat, Jun 28 2014 3:31 PM | Last Updated on Thu, Apr 4 2019 5:21 PM

మార్నింగ్ వాక్కు వెళ్తే.. సామూహిక అత్యాచారం - Sakshi

మార్నింగ్ వాక్కు వెళ్తే.. సామూహిక అత్యాచారం

చెల్లెలితో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లిన యువతిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగింది. మలియానా గ్రామానికి చెందిన యువతి (26) మార్నింగ్ వాక్కు వెళ్లినప్పుడు కొంతమంది యువకులు ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దాంతో వెంటనే ఆమె చెల్లి ఇంటివైపు పరిగెత్తి, ఎవరినైనా సాయం పిలవాలని ప్రయత్నించింది.

కానీ, వాళ్లు తిరిగి వచ్చేసరికి అక్కడకు కొంచెం దూరంలో ఉన్న పొలాల్లో ఆమె స్పృహ కోల్పోయి కనిపించింది. యశ్పాల్, రాజ్పాల్, రాజేంద్ర అనే ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరో ఇద్దరిని ఇంకా గుర్తించాల్సి ఉంది. నిందితులు ఐదుగురిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు మొదలుపెట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement