సామూహిక అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అండమాన్ నికోబార్ మాజీ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నరైన్‌ను అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని జితేంద్రకు సమన్లు జారీ చేశారు. పోర్ట్ బ్లెయిర్‌లో గురువారం విచారణకు హాజరైన అయన్ను అక్కడే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆయన బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. క
అండమాన్ నికోబార్ చీఫ్ సెక్రటరీగా ఉన్న సమయంలో జితేంద్ర నరైన్.. మరికొందరితో కలిసి ఒ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయనపై విచారణకు ఆదేశించడంతో దర్యాప్తు జరిపిన పోలీసులు.. తమ నివేదికను హోం మంత్రిత్వ శాఖకు పంపారు. దాంతో నరైన్‌ను అక్టోబర్ నెలలో హోంశాఖ సస్పెండ్ చేసింది.
నరైన్ తన అధికారాన్ని దుర్వినియోగపరిచారని, మున్ముందు కూడా దుర్వినియోగపరిచే అవకాశాలు ఉన్నాయని పోలీసులు శాఖ తన నివేదికలో పేర్కొంది. ఈ కేసును అండమాన్ నికోబార్ పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం విడివిడిగా దర్యాప్తు చేస్తోంది. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఏమాత్రం సహించమని.. నిందితుల స్థాయి, హోదాతో సంబంధం లేకుండా క్రమశిక్షణా రహిత చర్యలు తీసుకుంటామని నరైన్ సస్పెన్షన్ నోట్‌లో హోం మంత్రిత్వశాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment