గ్యాంగ్‌రేప్ కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్
గ్యాంగ్‌రేప్ కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్
Published Mon, Sep 26 2016 11:42 PM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM
కర్నూలు: ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామం క్రాస్ రోడ్డు వద్ద ఈనెల 22వ తేదీన వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన దళిత యువతిపై సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు పక్కన ఉన్న గుట్టలోకి బలవంతంగా తీసుకువెళ్లి మద్యం తాపించి అత్యాచారానికి ఒడిగట్టినట్లు బాధితురాలు ఓర్వకల్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం, నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ, వినోద్‌కుమార్ నేతృత్వంలో కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన శ్రీనివాసులు, బోయ రాముడు, గొల్ల దశరథ, బోయ మధుకృష్ణ, లొద్దిపల్లె గ్రామానికి చెందిన బోయ వెంకటేశ్వర్లు తదితరులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు విచారణలో తేల్చారు. సోమవారం ఆటోలో ప్రముఖ న్యాయవాది వద్దకు వెళ్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు మాటు వేసి నంద్యాల రోడ్డులోని రాగమయూరి బస్‌స్టాప్ వద్ద అరెస్టు చేశారు. నేరం జరిగిన రోజు కూడా అదే ఆటోను నిందితులు వినియోగించారు. దర్యాప్తులో భాగంగా ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్థానిక తాలూకా పోలీస్‌స్టేషన్‌లో సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి డీఎస్పీ వివరాలను వెల్లడించారు.
Advertisement
Advertisement