న్యూఢిల్లీ: డానిష్ మహిళ గ్యాంప్ రేప్ కేసులో అయిదుగురు నిందితులకు జీవితఖైదు విధిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. 2014లో జరిగిన ఈ రేప్ కేసును విచారించిన తిస్ హజారీలోని కోర్టు నిందితులు మహేంద్ర అలియాస్ గంజా(24), మహద్ రాజా(22), రాజు(23), అర్జున్(21), రాజు చక్కా(22)లకు శిక్షను ఖరారుచేసింది.
మొత్తం తొమ్మిది మంది డానిష్ మహిళను ఢిల్లీ రైల్వే స్టేషన్ కు దగ్గరలోని డివిజినల్ ఆఫీసర్ క్లబ్ కు సమీపంలో ఎవరూ రాని ప్రదేశానికి తీసుకువెళ్లి రేప్ చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. 55 ఏళ్ల శ్యామ్ లాల్ గత ఫిబ్రవరిలో మరణించాడు. కాగా, మిగిలిన ముగ్గురు మైనర్లు కావడంతో వారిని బాలనేరస్థుల గృహానికి తరలించి విచారిస్తున్నారు.