యూపీలో మరో సామూహిక అత్యాచారం! | Woman alleges gangrape | Sakshi
Sakshi News home page

యూపీలో మరో సామూహిక అత్యాచారం!

Published Sat, Jun 7 2014 11:19 AM | Last Updated on Tue, Oct 9 2018 7:05 PM

యూపీలో మరో సామూహిక అత్యాచారం! - Sakshi

యూపీలో మరో సామూహిక అత్యాచారం!

ఉత్తరప్రదేశ్లో మరో సామూహిక అత్యాచార ఘటన చోటు చేసుకుంది. సంబల్ జిల్లాలోని అసములి ప్రాంత నివాసిస్తున్న ఓ యువతి (35) తనపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారని ఆరోపించింది. అత్యాచార నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని సాంబల్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఆ ఘటనపై విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేయాలని ఎస్పీ అదేశాలు జారీ చేశారని స్థానిక పోలీసు అధికారి జగ్వీర్ సింగ్ శనివారం వెల్లడించారు.

 

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే బాధితురాలిని వైద్య పరీక్షల కోసం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వైద్య నివేదిక అందిన వెంటనే దర్యాప్తు మరింత వేగవంతం చేస్తామని వెల్లడించారు. జూన్ 5వ తేదీ బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నలుగురు యువకులు ప్రవేశించి... ఆమెపై సామూహిక అత్యాచారం చేశారని ఆరోపించిందని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement