డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): నగరం కీకారణ్యం అయింది... పట్టపగలే జనం కళ్లుండీ చూడలేని కబోదులయ్యారు... ఎవరంతకు వారు సమస్య తమది కాదన్నట్లు ముందుకెళ్లిపోయారు. సామాజిక బాధ్యతకు కొత్త అర్థం చెప్పారు. నిర్మానుష్య ప్రాంతంలో ఓ మహిళ (43)పై లైంగికదాడి జరిగిందంటే అది వేరు.. నగరం నడిబొడ్డున.. అదీ రోడ్డు పక్కనే ఓ అభాగ్య మహిళపై లైంగికదాడికి ఓ యువకుడు బరితెగించిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నిత్యం రద్దీగా ఉండే విశాఖపట్నంలోని తాటిచెట్లపాలెం నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లే దారిలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ దారుణానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో తాటిచెట్లపాలెం–రైల్వేస్టేషన్ రోడ్డులో పెద్దగా జనసంచారం లేకపోయినప్పటికీ వాహనాల రాకపోకలు సాగుతున్నాయి.
మతిస్థిమితం లేని ఓ మహిళ రైల్వే క్వార్టర్స్‌కు ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తోంది. ఒంటరిగా వెళ్తున్న ఆ మహిళను రైల్వే న్యూ కాలనీకి చెందిన శివ (23) అనే యువకుడు వెంబడించాడు. టైప్–4 రైల్వే క్వార్టర్స్ ప్రహరీని ఆనుకొని ఉన్న ఓ పెద్ద చెట్టు వద్ద ఆ మహిళ కూర్చుండిపోయింది. ఆమెను వెంబడిస్తున్న ఆ యువకుడు దగ్గరకు వెళ్లి అందరూ చూస్తుండగానే అందునా పట్టపగలే లైంగిక దాడికి పాల్పడ్డాడు. అటు ఇటు రాకపోకలు సాగిస్తున్న వాహన చోదకులు, పాదచారులు ఏమీ పట్టనట్లు తమదారిని తాము వెళ్లిపోయారు.
అయితే శ్రీను అనే ఆటో డ్రైవర్ సంఘటనను గమనించి ఆటోను ఆపి లైంగిక దాడికి పాల్పడతున్న దృశ్యాన్ని తన సెల్‌లో చిత్రీకరించాడు. లైంగికదాడికి పాల్పడిన అనంతరం ఆ యువకుడు బైక్‌పై వెళ్లిపోయాడు. ఆటో డ్రైవర్ శ్రీను ఇచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమై రైల్వే న్యూకాలనీకి సమీపంలో నిందితుడిని పట్టుకున్నారు. నాల్గోపట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లైంగిక దాడికి గురైన మహిళను సంఘటన జరిగిన ప్రాంతం నుంచి పోలీస్ స్టేషన్‌కు, అనంతరం వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు తమ అదుపులోనే ఉన్నాడని, అతనిపై రేప్ కేసు నమోదు చేస్తామని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ జీవీ రమణ చెప్పారు.
పట్టపగలు.. నడిరోడ్డుపై లైంగికదాడి
Published Mon, Oct 23 2017 3:46 AM | Last Updated on Tue, Oct 9 2018 7:05 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment