లైంగిక వేధింపుల కేసు: మహిళకు 10 ఏళ్ల జైలు
ఆమెకు ఇద్దరు భార్యలు.. అది చాలదన్నట్లు పక్కింటి పిల్లలపై లైంగిక వేధింపులు.. సెక్స్ డాల్స్ తో వికృత చేష్టలు.. కేసు నుంచి తప్పించుకునేందుకు అంతులేని డ్రామాలు.. సింగపూర్ దేశ నేరచరిత్రలోనే అత్యంత అరుదైన ఈ కేసులో ఆ దేశ సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పు చెప్పింది. ఇన్నాళ్లూ మగాడిగా చెలామణి అయిన ఆ మహిళకు 10 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే..
సింగపూర్ సిటీలోని ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తోన్న జునికా అహ్మద్(40) జన్యుపరంగా మహిళ. కానీ ఆమె మగవాడిగానే చెలామణి అయ్యేది. డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్, ఆహార్యం, ప్రవర్తనతో తాను మగాణ్నని అందరినీ నమ్మించేది. ఏకంగా ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ను మెయింటేన్ చేసేంది.. ఆ తర్వాత వాళ్లిద్దరినీ పెళ్లాడింది. ఇద్దరు భార్యలతో కలిసి అపార్ట్ మెంట్ లో ఉంటోన్న జునికా దృష్టి.. పక్క ఫ్లాట్ లో ఉండే 13 ఏళ్ల బాలికపై పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకుంది. చేతివేళ్లు, సెక్స్ డాల్స్ సహాయంతో చిన్నారిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడేంది. అలా ఆరునెలలపాటు ఆ వ్యవహరాన్ని రహస్యంగా సాగించింది.
ఏదో కారణం వల్ల 2012లో జునికాకు, పక్క ఫ్లాట్ వాళ్లతో గొడవైంది. అదే సమయంలో బాలిక కూడా తనపై జరుగుతోన్న అకృత్యాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో వాళ్లు (మగవాడు అని పేర్కొంటూ)జునికా పై పోలీస్ కేసు పెట్టారు. సింగపూర్ చట్టాల ప్రకారం 16 ఏళ్లలోపు పిల్లలపై లైంగికదాడి చేసిన, వారితో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నా గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. శిక్షకు భయపడ్డ జునికా.. తానసలు మగవాడినే కాననే రహస్యాన్ని కోర్టుకు తెలిపింది. దీంతో ఈ కేసు సంచలనంగా మారింది. నాలుగేళ్ల విచారణ అనంతరం జునికా కేసులో హైకోర్టు సెప్టెంబర్ 28న తీర్పు వెలువరించింది. ఆమె మగాడు కానందున మోపిన అభియోగాలల్లో ప్రధానమైనవాటిని కొట్టేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పాడు. అంతిమ న్యాయం కోసం బాలిక తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
పలు దఫాలుగా సాగిన విచారణ అనంతరం జునికా కేసుపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు చెప్పింది. కేవలం మగవాడు కాదన్న కారణంతోనే ఆమె చేసిన తప్పులను మన్నించలేమని, జునికా.. ఆ చిన్నారిపై చేసింది లైంగికదాడేనని, ఇందుకు శిక్షగా 10 ఏళ్ల కఠిన కారాగారం అనుభవించాలని తీర్పు వెల్లడించింది. లైంగికత(జెండర్) ను సాకుగా చూపి నేరాల నుంచి తప్పించుకోజాలరని, ఈ మేరకు చట్టాల్లో అవసరమైన మార్పులు చేపట్టాలని సింగపూర్ పార్లమెంట్ కు కోర్టు సూచనలు చేసింది.