జ్వేల్లో దుండగులు ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
హైదరాబాద్: మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. గజ్వేల్ మండల పరిధిలో దుండగులు రెండో రోజుల క్రితం ఓ యువతిని కిడ్నాప్ చేశారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, యాసిడ్ దాడి చేశారు. దుండగులు బాధితురాలిని ఆమె ఇంటి వద్ద పడేసి పరారయ్యారు.
బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.