రక్షకులే భక్షకులయ్యారు. మణిపూర్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతమైన తమెన్గ్లాంగ్ జిల్లాలో గ్రామ రక్షక దళానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈనెల 21వ తేదీన తన స్వగ్రామమైన డిస్లాండ్కు ఆమె తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగినా.. ఆలస్యంగా వెలుగుచూసింది. నోనీ పోలీసు స్టేషన్కు అనుబంధంగా ఉన్న గ్రామ రక్షకదళం సభ్యులు బాగా తాగి, ఆ మత్తులో ఆమెను వేధించి, తర్వాత సమీపంలోని ఓ అడవిలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
తర్వా నోనీ పోలీసు స్టేషన్లో బాధితురాలు తన భర్తతో కలిసి ఈ ఆరుగురిపై ఫిర్యాదు చేసింది. వారందరినీ వెంటనే రక్షకదళం విధుల నుంచి తొలగించినట్లు పోలీసులు తెలిపారు. కోర్టు వారికి సోమవారం వరకు రిమాండు విధించింది.
మణిపూర్లో మహిళపై గ్రామరక్షకుల అత్యాచారం
Published Sat, Sep 28 2013 10:46 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
Advertisement
Advertisement