మధ్యప్రదేశ్లో 15 ఏళ్ల యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన సెహత్గంజ్ సమీపంలోని మహదేవ్పాణి వద్ద జరిగింది. భోపాల్కు చెందిన ఈ యువతి తన స్నేహితులతో కలిసి ఈ ప్రాంతానికి గురువారం సాయంత్రం వచ్చింది. గుర్తు తెలియని నలుగురు యువకులు వారిద్దరినీ పట్టుకుని, ఆమె స్నేహితుడిని చెట్టుకు కట్టేసి, ఒకరి తర్వాత ఒకరుగా ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె తన స్నేహితుడి కట్లు విప్పగా, వారిద్దరూ భోపాల్కు తిరిగి వెళ్లారు.
అనంతరం జరిగిన సంఘటనపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భోపాల్ పోలీసులు ఈ కేసును రాయ్సేన్ పోలీసులకు బదిలీ చేశారు. వారు నలుగురు గుర్తు తెలియని నిందితులపై సామూహిక అత్యాచారం కేసు నమోదుచేశారు. వారికోసం గాలిస్తున్నారు. ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ యువతి, ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తితో కలిసి ఓ పిక్నిక్ స్పాట్ వద్దకు బయల్దేరినప్పుడు ఈ సంఘటన జరిగింది.
టీనేజి యువతిపై సామూహిక అత్యాచారం
Published Sat, Feb 8 2014 1:15 PM | Last Updated on Mon, Apr 8 2019 6:21 PM
Advertisement
Advertisement