
ప్రతీకాత్మక చిత్రం
ఇండోర్ : తన ప్రేమను తిరస్కరించిందనే కారణంతో యువతిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడో వ్యక్తి. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... కమలేశ్ సాహు(26), సుప్రియా జైన్(25) ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఈ క్రమంలో తనను ప్రేమించాలంటూ కమలేశ్ సుప్రియను వేధించేవాడు. కానీ ఇందుకు ఆమె అంగీకరించకపోవడంతో.. ఆరేళ్ల క్రితం మణికట్టు కోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతడి తల్లిదండ్రులు కమలేశ్‌ను... సుప్రియ నుంచి దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఉన్నత చదువుల కోసమని అతడిని వేరే ఊరికి పంపించారు.
కాగా ఆర్నెల్ల క్రితం కమలేశ్ నగరానికి తిరిగి వచ్చాడు. ఫేస్‌బుక్ ప్రొఫైల్ ద్వారా సుప్రియ వివరాలు తెలుసుకుని.. మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి సుప్రియపై కక్ష పెంచుకున్న కమలేశ్.. ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వారం రోజుల క్రితం ఓ కత్తిని కొనుగోలు చేశాడు. గురువారం రాత్రి కత్తితో దాడి చేసి.. 38 సార్లు పొడిచాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా శుక్రవారం ఉదయం మరణించింది. తన ప్రేమను అంగీకరించకుండా అవమానిచండంతో.. ఆమెను హత్య చేసినట్లు కమలేశ్ చెప్పాడని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment