శివరాజ్‌సింగ్ చౌహాన్
ఛత్తర్‌పూర్: మధ్యప్రదేశ్ కేబినెట్‌లో త్వరలోనే ఆవుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆదివారం వెల్లడించారు. ‘ప్రస్తుతమున్న గో పాలన, పశుసంవర్ధక బోర్డు చాలా పరిమితుల్లో పనిచేయాల్సి వస్తోంది. అందుకే దీని స్థానంలో గో మంత్రిత్వ శాఖను త్వరలోనే ప్రవేశపెడతాం’ అని ఖజురహోలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన స్పష్టం చేశారు. ఆవుల సంరక్షణ, గోవుకు సంబంధించిన ఇతర అంశాలపై ఈ శాఖ పనిచేస్తుందన్నారు. మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లాలో.. దేశంలోనే ఆవులకోసం ఉద్దేశించిన తొలి సంరక్షణ కేంద్రాన్ని తమ ప్రభుత్వం ఏర్పాటుచేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఇటువంటి కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment