ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి
ప్రధాని మోదీకి ఓబీసీ ఎంపీల ఫోరం విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ఓబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఓబీసీ పార్లమెంటరీ ఫోరం ఆధ్వర్యంలో ఎంపీల ప్రతినిధి బృందం ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది. అలాగే జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించాలని విన్నవిం చింది. ఓబీసీ పార్లమెంటరీ ఫోరం కన్వీనర్ వి.హనుమంతరావు నేతృత్వంలో ఎంపీల ప్రతినిధి బృందం బుధవారం పార్లమెంటులో ప్రధానిని కలసి వినతి పత్రాన్ని అందజేశారు.
దేశ జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న ఓబీసీల్లో 50 శాతం మంది పేదరికంలో ఉన్నారని వారి ఆర్థిక వికాసానికిక, ఓబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. జాతీయ బీసీ కమిషన్ చట్టంలో సవరణలు తీసుకురావాలని, క్రీమీలేయర్‌ను ఎత్తివేసి ఓబీసీలను వర్గీకరించాలని కోరారు. మోదీని కలిసిన వారిలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీలు నాచి యప్పన్, దేవేందర్ గౌడ్, ఎంపీ బూర నర్స య్య గౌడ్, రాపోలు, కొనకళ్ల నారాయణ, కె.రామ్మోహన్నాయుడు, రాంకృపాల్ యాదవ్, రాంగోపాల్ యాదవ్ తదితరులున్నారు.