రేపుల రాజ్యం యూపీ!
ఉత్తరప్రదేశ్ రేపుల రాజ్యంగా మారుతోంది. మరో రెండు ఘోరమైన అత్యాచారాలు వెలుగు చూశాయి. రెండు కేసుల్లోనూ రక్షకులే భక్షకులయ్యారు.
తొలి సంఘటన మైనర్ బాలికల రేపు, హత్యల ఘటనతో మే 28 నుంచి అట్టుడుకుతున్న బదాయూలోనే జరిగింది. ఒక మైనర్ బాలికను దుండగులు అపహరించి, నెలరోజుల పాటు ఆమెపై అత్యాచారం చేశారు. ఆమెది ఇస్లామ్ పూర్. తనను మొదట ఎమ్మెల్యే డ్రైవర్, ఆ తరువాత బబ్రాల్ ఎమ్మెల్యే, సమాజ్ వాదీ పార్టీ నేత రామ్ ఖిలాడీ యాదవ్ లు అత్యాచారం చేశారని ఆ బాలిక ఆరోపిస్తోంది. నెల రోజులుగా అమ్మాయి కనిపించకపోవడంతో స్థానికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఫలితంగా అమ్మాయిని దుండగులు విడిచిపెట్టారు.
ఇక రెండో సంఘటనలో, పోలీస్ నిర్బంధంలో ఉన్న తన భర్తను కలిసేందుకు వెళ్లిన ఒక మహిళను స్టేషన్ హౌస్ ఆఫీసర్ సహా, పలువురు కానిస్టేబుళ్లు బలాత్కరించారు. ఈ సంఘటన హమీర్ పూర్ జిల్లా లోని సుమేర్ పూర్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. ఎస్ హెచ్ ఓ అరెస్టయ్యారు. కానిస్టేబుళ్లు కాలికి బుద్ధి చెప్పారు.
యూపీలో ప్రతి రోజూ కనీసం పది రేపు కేసులు నమోదవుతున్నాయి. మొత్తం మీద యువ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కి రేపులు పెద్ద తలనొప్పిగా మారాయి.