ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. లిఫ్టు ఇస్తామని చెప్పి.. ముగ్గురు యువకులు ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. జాన్పద్ హపూర్ గ్రామానికి చెందిన బాధితురాలు సోమవారం నాడు వారపు సంత కోసం బుధానా గేట్ ప్రాంతానికి వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆ ముగ్గురు యువకులు ఆమెకు లిఫ్ట్ ఇస్తామని చెప్పి.. ఆమెను ఫతేలాపూర్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి బలవంతంగా లాక్కెళ్లి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి, ఒకరి తర్వాత ఒకరిగా ఆమెను చెరిచారు.
అనంతరం బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు యువకులపై కేసు నమోడు చేశారు. ఫిర్యాదులో ఆమె తెలిపిన వివరాల ప్రకారం చూస్తే, మహిళపై సామూహిక అత్యాచారం చేసిన తర్వాత, ఆమెను హపూడ్ గ్రామానికి తీసుకెళ్లి, కదులుతున్న కారులోంచి ఆమెను కిందకు తోసేసి అక్కడి నుంచి పారిపోయారు. నిందితులలో ఒకరు తనకు తెలియడం వల్లే వారు లిఫ్టు ఇస్తామంటే వాళ్ల వాహనంలో ఎక్కినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. నిందితులలో ఇద్దరిని రషీద్, మష్రుగా గుర్తించారు. మొత్తం ముగ్గురినీ అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
లిఫ్టు ఇస్తామని చెప్పి.. గ్యాంగ్ రేప్
Published Wed, Jan 22 2014 1:35 PM | Last Updated on Sat, Sep 2 2017 2:53 AM
Advertisement
Advertisement