
ప్రియురాలిపై ప్రియుడు, మరో ఇద్దరు గ్యాంగ్ రేప్
ఓ యువతిపై ఆమె ప్రియుడు, మరో ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో చోటుచేసుకుంది.
మీరట్: ఓ యువతిపై ఆమె ప్రియుడు, మరో ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... భవాన్పూర్ ప్రాంతానికి చెందిన బాధితురాలితో శాస్త్రి నగర్ కు చెందిన నగీన్ గుప్తా పరిచయం పెంచుకున్నాడు. తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి ఆమెను ప్రేమలోకి దించాడు.
ఈ విషయం తెలియడంతో అతడిని ఆమె నిలదీసింది. ఈనెల 18న రెస్టారెంట్ కు రావాలని ఆమెకు నగీన్ ఫోన్ చేశాడు. అక్కడ అతడి సోదరుడు ఆశు, స్నేహితుడు నిక్కీ ఉన్నారు. ఆమెను మాటల్లోకి దించి పల్లవపురం ప్రాంతంలోని ఓ ఇంటికి తీసుకున్నారు.
ఆమెకు మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దురాగతాన్ని వీడియో తీశారు. తమ గురించి ఎవరికైనా చెబితే వీడియో ఇంటర్నెట్ లో పెడతామని బెదిరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.