మధ్యప్రదేశ్లో కుమార్తెకు చికిత్స చేయించేందుకు వెళ్లిన ఓ యువతిపై ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
హొషంగాబాద్లో ఓ యువతి తన కుమార్తెను చికిత్స కోసం ఇటీవల ఆస్పత్రిలో చేర్పించింది. ఆదివారం రాత్రి వాష్రూమ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆమెను సెక్యూరిటీ గార్డు, వార్డు బాయ్ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవంతిలోకి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన గురించి బాధితురాలు తన భర్తకు తెలియజేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు ఆదిత్య, దీపక్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో యువతిపై సామూహిక అత్యాచారం
Published Mon, Oct 21 2013 1:00 PM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM
Advertisement
Advertisement