Hoshangabad
-
Lok sabha elections 2024: రాచరిక మాంత్రికుడు రాహుల్: మోదీ
హోషంగాబాద్/సాక్షి బెంగళూరు: ఒక్క దెబ్బతో దేశంలోని పేదరికాన్ని నిర్మూలించవచ్చంటూ కాగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ తప్పుపట్టారు. రాహుల్‌ను రాచరిక మాంత్రికుడిగా అభివరి్ణంచారు. ఆయన వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పారు. ఆదివారం మధ్యప్రదేశ్‌లో హోషంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పిపారియా పట్టణంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘ఒక్కదెబ్బతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించవచ్చని కాంగ్రెస్ రాజకుమారుడు ప్రకటించారు. నిజంగా నవ్వొస్తోంది. ఆ రాజరిక మాంత్రికుడు ఇన్నాళ్లూ ఎక్కడికెళ్లారు. ఆయన నాన్నమ్మ 50 ఏళ్ల క్రితం గరీబీ హఠావో అంటూ నినాదం ఇచ్చారు. పేదరికం మాత్రం పోలేదు. అందుకే ఆ రాజకుమారుడి మాటలను జనం పట్టించుకోవడం లేదు. ఆ కుటుంబ(సోనియా గాం«దీ) సభ్యులు 2014 కంటే ముందు పదేళ్ల పాటు రిమోట్ కంట్రోల్‌తో ప్రభుత్వాన్ని నడిపించారు. అప్పుడు పేదరికం గుర్తుకురాలేదు. ఇప్పుడు హఠాత్తుగా పేదరికాన్ని నిర్మూలించే మంత్రం కనిపెట్టారు. ఇష్టం వచి్చనట్లు మాట్లాడుతూ నవ్వులపాలవుతున్నారు. పేదరికంపై జోక్‌లు వేయొద్దని కోరుతున్నా’’ అని మోదీ స్పష్టం చేశారు. -
మరో యువతితో ప్రియుడి పెళ్లి, గుండెలు పగిలేలా ప్రేయసి రోదన
మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక వయసులో ప్రేమలో పడటం సహజం. నచ్చిన వ్యక్తి కంటికి తారసపడితే మనసులో కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. రెండు అక్షరాల ప్రేమను పొందిన వారంతా మూడు మూళ్ల బంధంతో ఒకటి కాలేరు. యుద్ధం చేసి అయిన ప్రేమను దక్కించుకునే వారు కొందరైతే, చిన్న చిన్న కారణాలకే విడిపోయే జంటలు అనేకం. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్లు దూరం అయితే కలిగే బాధ నరకం కంటే దారుణంగా ఉంటుంది. కారణాలేమైనా ప్రాణం అనుకున్న వాళ్లు మన కళ్ల ముందే వేరే వారితో జీవితాన్ని పంచుకునేందుకు సిద్ధపడితే కలిగే వేదన వర్ణణాతీతం. అలాంటి హృదయవిదారక వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయిని వివాహం చేసుకుంటుండగా పెళ్లి మండపం వద్ద ప్రియురాలు గుండెలు పగిలేలా రోదించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని హోసంగాబాద్‌లో జరిగింది. వివరాలు.. కాన్పూర్‌కు చెందిన ఓ యువతి ఉద్యోగ నిమిత్తం భోపాల్‌లో ఉంటోంది. ఈమె పనిచేసే సంస్థలోనే ఉద్యోగం చేసే ఓ వ్యక్తితో గత మూడేళ్ల నుంచి సహజీవనం చేస్తోంది. అయితే ఇటీవల అతనికి తల్లిదండ్రులు వేరే మహిళతో రహస్యంగా పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రేయసి పెళ్లి జరుగుతున్న వేడుక వద్దకు వెళ్లింది. లోపలికి వెళ్లేందుకు యువతి ప్రయత్నించగా.. సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నారు. దీంతో ఆమె మండపం బయట నుంచే ‘బాబు..బాబు’(అతన్ని ముద్దుగా పిలుచుకనే పేరు) అంటూ గుండెలు పగిలేలా రోదించింది. మండపం నుంచి బయటకు రావాల్సిందిగా కేకలు చేసింది. తనతో ఒక్కసారి మాట్లాడాలని వేడుకుంది. కాగా యువతి హల్చల్ చేస్తుండడం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఆమెను వివరాలు అడగడంతో.. ప్రస్తుతం పెళ్లి చేసుకుంటున్న వరుడు తన ప్రేమికుడని, తనతో కలిసి మూడేళ్లు సహజీవనం చేసి, ఇప్పుడు రహస్యంగా పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పింది. అతడిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలపగా.. ఇంట్లో వాళ్లకు ఇబ్బందులు వస్తాయని సదరు యువతి కంప్లైంట్ ఇవ్వలేదని సమాచారం. వెంటనే తనతోపాటు వచ్చిన వారితో కలిసి భోపాల్ వెళ్లిపోయింది. -
ఆ పట్టణం పేరు మారుస్తాం: సీఎం
భోపాల్: మధ్యప్రదేశ్ పట్టణం హోషంగాబాద్ పేరును మార్చనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. నర్మదా నది ఒడ్డున ఉన్న ఈ సిటీకి నర్మదాపురంగా నామకరణం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు పేర్కొన్నారు. నర్మద జయంతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘హోషంగాబాద్ పేరు మార్చాలా, వద్దా?’’ అని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశ్నించారు. ఇందుకు బదులుగా కచ్చితంగా మార్చాల్సిందే అంటూ సమాధానం రాగా. ఏ పేరు అయితే బాగుంటుందో సూచించాలంటూ ఆయన కోరారు. హోషింగాబాద్ను నర్మదాపురంగా వ్యవహరిస్తే బాగుంటుందంటూ ప్రజలు బదులిచ్చారు. ఇందుకు సరేనన్న ముఖ్యమంత్రి, నర్మదా నదిని కాపాడుకుందామని, నదీ తీరంలో సిమెంటు, కాంక్రీటు కట్టడాలు చేపట్టకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కాగా హోషంగాబాద్ పేరు మార్పు ప్రకటనపై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ప్రోటెం స్పీకర్ రామేశ్వర్ శర్మ ఆధ్వర్యంలో శనివారం ఉదయం పటాకులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘ఇదొక చారిత్రాత్మక క్షణం. మధ్యప్రదేశ్‌కు నర్మదా నది జీవనాడి వంటిది. హోషింగ్ షా ఆక్రమణతో హోషింగాబాద్ అనే పేరు స్థిరపడిపోయింది. అయితే ఇప్పుడు తల్లి నర్మద పేరుతో పట్టణాన్ని పిలుచుకునే సమయం ఆసన్నమైంది. ఇందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రజల మనోభావాలకు గౌరవం ఇచ్చి ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ద్రవోల్బణం, ఇంధన ధరల పెంపు వంటి ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ సర్కారు ఇలాంటి ప్రకటనలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్తా మండిపడ్డారు. ‘‘మొఘల్ పాలకుల పేర్లతో ముడిపడిన పట్టణాల పేర్లను మాత్రమే బీజేపీ పాలకులు మారుస్తారు. బ్రిటీష్ రూలర్ల పేరుతో ఉన్న మింటో హాల్(విధాన సభ పాత భవనం) పేరు మాత్రం ఎందుకు మార్చడం లేదు. ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలకు బదులు అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలి’’అని హితవు పలికారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పలు పట్టణాల పేర్లు మార్పు! ఉత్తరప్రదేశ్ ముఖ్య పట్టణం అలహాబాద్ పేరును ప్రయాగరాజ్‌గా, ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మారుస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అదే విధంగా హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లా పేరును శ్యామలగా మార్చే అవకాశం ఉందని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు గతంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఎలాంటి చట్టబద్దమైన ఇబ్బందులు తలెత్తని పరిస్థితుల్లో గుజరాత్ పట్టణం అహ్మదాబాద్ పేరును కర్ణావతిగా మారుస్తామంటూ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ గతంలో ఓ ప్రకటన చేశారు. ఈ క్రమంలో బీజేపీ అధినాయకత్వ వ్యవహార శైలిపై విమర్శలు ఎక్కుపెడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. చదవండి: సంతృప్తికర సమాధానాలు ఇవ్వండి: జడ్జి లవ్ జిహాద్‌పై శ్రీధరన్ సంచలన వ్యాఖ్యలు! -
చెట్టు నుంచి దూరం చేయడంతో చితక్కొట్టారు
భోపాల్: అడవిలోని చెట్టును తాకనీయక పోవడంతో.. ఊరి ప్రజలంతా ఒక్కటై పోలీసులను చితకబాదారు. ఈ ఘటన బుధవారం మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. తమ గ్రామానికి సమీపంలోని అడవిలో ఉన్న ఒక పవిత్ర చెట్టును తాకనీయకుండా పోలీసులు అడ్డుపడుతున్నారనే కోపంతో.. గ్రామస్తులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 11 మంది పోలీసులు తీవ్రంగా గాయపడగా.. ఒక ఎస్ఐ, కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని హోషంగాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఘన్‌శ్యామ్ మాలవీయ తెలిపారు. గ్రామస్తులు పోలీసులపై తెగబడడానికి గల కారణాలేమిటో ఇంకా తెలియలేదని అన్నారు. అడవిలో ఉన్న ప్రత్యేకమైన ఆ పవిత్ర చెట్టును వరుసగా ఐదు బుధవారాలు లేదా ఐదు ఆదివారాలు ఎవరైనా తాకితే వారికి ఉన్న సర్వరోగాలు నయమవుతాయనే వదంతులు గత సెప్టెంబర్ నవరాత్రి ఉత్సవాల నుంచి ఊపందుకున్నాయని అధికారి పేర్కొన్నారు. దీంతో అక్కడి గోండులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి.. ఇప్ప చెట్టును తాకడం ప్రారంభించారు. వదంతుల కారణంగా సాత్పురా టైగర్ రిజర్వ్ ఉన్న ఆ అడవిలోకి.. అధిక సంఖ్యలో గోండులు తరలివచ్చి.. పవిత్ర ఇప్ప చెట్టును దర్శించుకుంటున్నారని సదరు పోలీసు అధికారి వివరించారు. కాగా బంఖేడి ప్రాంతానికి చెందిన రూప్ సింగ్ అనే వ్యక్తి తాను అటవి గుండా ప్రయాణిస్తుండగా.. అద్భుతమైన దైవశక్తి తనను ఇప్ప చెట్టు వైపుకు లాగిందని.. జోరుగా నయాగావ్‌లో ప్రచారం చేశాడని ఓ పోలీసు అధికారి చెప్పారు. రాష్ట్ర రాజధాని భోపాల్‌కు దక్షిణంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో అనూహ్యంగా నెల రోజుల నుంచి జనాలు గుంపులు కడుతున్నారని.. దీంతో అక్కడ ఒక నెల వ్యవధిలోనే అకస్మాత్తుగా 400కు పైగా పూజ సామాగ్రిని అందించే షాపులు పుట్టుకొచ్చాయని విషయాన్ని మీడియా ముందు వెల్లడించారు. నయాగావ్‌లో ఉద్రిక్త పరిస్థితులకు తెరదీసిన కారణాలేమిటో ఇంకా తెలియరాలేదని.. పోలీసులపై దాడి విషయమై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. అయితే అక్కడి షాపులను పాలకవర్గం ఇప్పటికే తొలగించిందని.. కుప్పలు తెప్పలుగా వస్తున్న జన సమూహాన్ని క్రమబద్దికరించే ప్రయత్నంలో పోలీసుల పైకి దాడికి దిగారన్నారు. అడవిలోకి ప్రవేశం కల్పించడంపై పోలీసులు, గ్రామస్తుల మధ్య తరచు వాగ్వాదం జరుగుతుండేదని తెలిపారు. పరిస్థితి తమ చేయి దాటిందని.. వారిని నిలువరించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేసినా.. కొత్త మార్గాల్లో అడవిలోకి చొరబడి వెళుతున్నారని పోలీసు అధికారులు అసహనం వ్యక్తం చేశారు. పోలీసులపై దాడి జరగడంతో ఇప్పటికైనా ఈ సమస్యకు పరిష్కారం కనుగొని పరిస్థితులను చక్కదిద్దేందుకు అక్కడి పాలకవర్గం సరియైన ప్రణాళికతో ముందుకు వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. -
వివాహేతర సంబంధం; 500 ముక్కలుగా నరికి....
భోపాల్ : తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని నిలదీసిన డ్రైవర్‌ను అత్యంత పాశవికంగా హతమార్చాడో ప్రభుత్వ వైద్యుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు... సునీల్ మంత్రి(56) ప్రభుత్వాసుపత్రిలో ఆర్థోపెడిక్ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతడి భార్య బొటిక్ నడిపేది. అయితే గత కొన్ని రోజుల క్రితం ఆమె చనిపోవడంతో.. ఆమె వద్ద పనిచేసే ఓ వివాహిత బొటిక్ బాధ్యతలు తీసుకుంది. ఈ క్రమంలో సునీల్ మంత్రి ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం సదరు మహిళ భర్త వీరేంద్ర పచౌరీకి తెలియడంతో అతడిని తన వద్ద డ్రైవర్‌గా నియమించుకున్నాడు. ఎక్కువ జీతం ఆశ చూపినప్పటికీ లొంగని వీరేంద్ర తన భార్యతో సంబంధం కొనసాగిస్తే పరువు తీస్తానని సునీల్‌ను బెదిరించేవాడు. ఈ క్రమంలో అతడి అడ్డు తొలగించాలని భావించిన సునీల్ సోమవారం రాత్రి వీరేంద్రను హత్య చేశాడు. ముక్కలుగా నరికి..యాసిడ్‌లో కరిగించాడు వీరేంద్రను హత్య చేసిన అనంతరం ఆధారాలు దొరకకుండా చేసేందుకు.. సునీల్ అతడి శవాన్ని 500 ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత కొన్నింటిని యాసిడ్‌లో కరిగించాడు. అయితే సునీల్ ప్రవర్తనపై అనుమానం రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఓ డ్రమ్‌లో యాసిడ్.. పక్కనే పాక్షికంగా కాలిన మనిషి శరీర భాగాలను గుర్తించారు. దీంతో సునీల్‌ను అరెస్టు చేసి విచారించగా అతడు నేరం అంగీకరించాడని ఎస్పీ అరవింద్ సక్సేనా తెలిపారు. -
పోలీసులతో సెల్ఫీ పుణ్యమాని..
భోపాల్: మధ్యప్రదేశ్ పోలీసుల సరికొత్త ఆలోచనే 'సెల్ఫీ విత్ కాప్స్'. సోషల్ మీడియాలో ఆకతాయిల ఆట కట్టించేందుకు 'సెల్ఫీ విత్ కాప్స్' పేరుతో రాష్ట్ర పోలీసులు అమ్మాయిలతో సెల్ఫీలు దిగుతున్నారు. అదేంటి పోలీసులతో సెల్ఫీ దిగితే ఆకతాయిలు వదిలిపెడతారా? అనుకుంటున్నారా.. ఆ సెల్ఫీని వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టమని వారు సూచిస్తున్నారు. అంతేకాదు స్టేటస్ లో 'ఇతను మా అన్నయ్య' అని కూడా రాయమని చెబుతున్నారు. పోలీసుతో ఉన్న ఫోటో ఒక్కటి ఆకతాయిని అడ్డుకోవడానికి సరిపోతుందని అంటున్నారు. అప్పటికీ మాట వినకపోతే.. తమ పద్ధతిలో వారికి బుద్ధి చెబుతామని తెలిపారు.వారం క్రితం మధ్యప్రదేశ్ లోని హూషంగాబాద్ లో ప్రారంభమైన ఈ క్యాంపైన్ కు అమ్మాయిల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటివరకూ 500మందికి పైగా అమ్మాయిలు దగ్గరలోని పోలీసుస్టేషన్ కు వెళ్లి అధికారితో సెల్ఫీలు తీసుకున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న వాట్సాప్ వేధింపుల నిరోధానికి మార్గాలు అన్వేషిస్తున్న సమయంలో ఈ ఆలోచన వచ్చినట్లు హోషంగాబాద్ ఎస్పీ ఏపీ సింగ్ తెలిపారు. 'సెల్ఫీ విత్ కాప్'కు భారీ స్పందన కూడా వస్తోందని పేర్కొన్నారు. కొద్ది నెలల క్రితం హోషంగాబాద్ జిల్లాలో వాట్సాప్ వేధింపులపై విపరీతంగా కేసులు నమోదయినట్లు వెల్లడించారు. వీటిలో ఆకతాయిలు వేర్వేరు నంబర్ల నుంచి అసభ్య సందేశాలు, చిత్రాలు పంపుతున్నారంటూ నమోదైన కేసులే ఎక్కువని చెప్పారు. ఎస్పీ ఏపీ సింగ్ మాదిరి కొత్త పద్ధతులను అవలంబించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 51 జిల్లాల ఎస్పీలకు డీజీపీ రిషికుమార్ శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో ఉత్తమమైన పద్ధతికి అవార్డు కూడా అందించనున్నారు. ఇప్పటివరకు 12 జిల్లాలకు చెందిన పోలీసులు సరికొత్త ఆలోచనలతో ముందుకు వచ్చి అమల్లోకి తెచ్చారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో యువతిపై సామూహిక అత్యాచారం
మధ్యప్రదేశ్‌లో కుమార్తెకు చికిత్స చేయించేందుకు వెళ్లిన ఓ యువతిపై ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. హొషంగాబాద్లో ఓ యువతి తన కుమార్తెను చికిత్స కోసం ఇటీవల ఆస్పత్రిలో చేర్పించింది. ఆదివారం రాత్రి వాష్‌రూమ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆమెను సెక్యూరిటీ గార్డు, వార్డు బాయ్ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవంతిలోకి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన గురించి బాధితురాలు తన భర్తకు తెలియజేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు ఆదిత్య, దీపక్‌లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.