Lok sabha elections 2024: రాచరిక మాంత్రికుడు రాహుల్‌: మోదీ | Lok sabha elections 2024: PM Modi mocks Rahul Gandhi as royal magician over will erase poverty in one stroke remark | Sakshi
Sakshi News home page

Lok sabha elections 2024: రాచరిక మాంత్రికుడు రాహుల్‌: మోదీ

Published Mon, Apr 15 2024 5:09 AM | Last Updated on Mon, Apr 15 2024 5:09 AM

Lok sabha elections 2024: PM Modi mocks Rahul Gandhi as royal magician over will erase poverty in one stroke remark - Sakshi

హోషంగాబాద్‌/సాక్షి బెంగళూరు: ఒక్క దెబ్బతో దేశంలోని పేదరికాన్ని నిర్మూలించవచ్చంటూ కాగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ తప్పుపట్టారు. రాహుల్‌ను రాచరిక మాంత్రికుడిగా అభివరి్ణంచారు. ఆయన వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పారు. ఆదివారం మధ్యప్రదేశ్‌లో హోషంగాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పిపారియా పట్టణంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు.

‘‘ఒక్కదెబ్బతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించవచ్చని కాంగ్రెస్‌ రాజకుమారుడు ప్రకటించారు. నిజంగా నవ్వొస్తోంది. ఆ రాజరిక మాంత్రికుడు ఇన్నాళ్లూ ఎక్కడికెళ్లారు. ఆయన నాన్నమ్మ 50 ఏళ్ల క్రితం గరీబీ హఠావో అంటూ నినాదం ఇచ్చారు. పేదరికం మాత్రం పోలేదు. అందుకే ఆ రాజకుమారుడి మాటలను జనం పట్టించుకోవడం లేదు. ఆ కుటుంబ(సోనియా గాం«దీ) సభ్యులు 2014 కంటే ముందు పదేళ్ల పాటు రిమోట్‌ కంట్రోల్‌తో ప్రభుత్వాన్ని నడిపించారు. అప్పుడు పేదరికం గుర్తుకురాలేదు. ఇప్పుడు హఠాత్తుగా పేదరికాన్ని నిర్మూలించే మంత్రం కనిపెట్టారు. ఇష్టం వచి్చనట్లు మాట్లాడుతూ నవ్వులపాలవుతున్నారు. పేదరికంపై జోక్‌లు వేయొద్దని కోరుతున్నా’’ అని మోదీ స్పష్టం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement