
హరియానా: హరియాణాలో 15 ఏళ్ల బాలికపై పైశాచికంగా కబళించిన మృగాలు.. అనంతరం ఆమెను దారుణంగా హతమార్చి ఓ కాలువలో పడేసిన ఘటన మరవకముందే ఫరీదాబాద్‌లో మరో ఘటన వెలుగుచూసింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ 22 ఏళ్ల మహిళను నలుగురు యువకులు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. అనతరం నడుస్తున్న కారులో ఆ నలుగురు ఆమెపై రెండు గంటలపాటు సామూహిక లైంగిక దాడి చేశారు. అనంతరం ఆమెను బల్లాబ్‌ఘర్ సమీపంలో పడేసి వెళ్లారు.
బాధితురాలు తన సోదరునికి విషయం తెలియజేయడంతో అతను పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. బాదితురాలు స్కార్పియో కారులో వచ్చిన ముగ్గురు, కారు డ్రైవర్ తనపై అత్యాచారం చేశారని తెలిపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా నిందితులు దొరలేదు. ఈ ఘటన కూడా గత శనివారం జరగడం గమనార్హం.