వాట్సప్లో గ్యాంగ్ రేప్ వీడియో, మహిళ ఆత్మహత్య
ముజఫర్ నగర్: ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహిత(40)పై నలుగురు దుండగులు గ్యాంగ్ రేప్కు పాల్పడి ఆ దృష్యాలను వాట్సప్లో షేర్ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ మహిళ విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ముజఫర్ నగర్ జిల్లాలోని చాప్రా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ముజఫర్ నగర్ ఎస్పీ ప్రదీప్ గుప్తా మాట్లాడుతూ.. 'చాప్రా గ్రామానికి చెందిన ఓ మహిళపై ఆదివారం నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను వీడియో తీసి వాట్సప్లో షేర్ చేశారు. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న సదరు మహిళ విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది' అని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపిన ఆయన దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.