
స్కూలు నుంచి వస్తుండగా విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
లక్నో: ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. స్కూలు నుంచి వస్తున్న 9వ తరగది విద్యార్థిని నలుగురు దుండగులు అడ్డగించి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఎతాహ్ జిల్లా అలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తప్వా గ్రామంలో ఈ ఘటన జరిగింది.
సోమవారం బాధితురాలు స్కూల్లో ఫీజు కట్టి ఇంటికి సైకిల్పై బయల్దేరింది. దారి మధ్యలో నలుగురు గుర్తుతెలియని యువకులు ఆ బాలికను అడ్డగించి నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి నుంచి బంగారు ఆభరణాలు దోచుకుని వెళ్లిపోయారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.