
అసాంఘిక శక్తుల అడ్డా.. కాచాపూర్ గుట్ట
► యథేచ్ఛగా వ్యభిచారం
► గుట్టపై గుడుంబా తయూరీ కేంద్రాలు, పేకాట స్థావరాలు
► చల్లూరు యువతిపై గ్యాంగ్‌రేప్ జరిగింది ఇక్కడే
► గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో
► పట్టించుకోని పోలీసులు
వీణవంక : వీణవంక నుంచి శంకరటప్నం వెళ్లేదారిలో ఆరో నంబర్ కిలోమీటర్ రాయి సమీపంలో 110 ఎకరాల్లో విస్తరించి ఉంది కాచాపూర్ గుట్ట. శంకరపట్నం మండలం పరిధిలోకి వచ్చే ఈ గుట్ట అసాఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. పెద్దపెద్ద రాళ్లు, చెట్ల పొదలతో ఉండే గుట్ట రెండు మండలాల అక్రమార్కులకు కలిసివస్తోంది. గతంలో ఇక్కడ అనేక సంఘటనలు జరిగారుు. ఇటీవల చల్లూరు యువతిపై గ్యాంగ్‌రేప్ జరిగింది కూడ ఇక్కడే. ‘సాక్షి’ గురువారం ఈ గుట్టవద్దకు వెళ్లి చుట్టపక్కల రైతులు, సమీపంలోనివారితో మాట్లాడింది. ఈ సందర్భంగా ఎన్నో భయంకరమైన విషయూలు వెల్లడయ్యూయి.
వీణవంకకు ఆరు కిలోమీటర్లు, శంకరపట్నానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ గుట్ట ఉంది. ఇక్కడ ఆరేళ్ల క్రితం గ్రానైట్ క్వారీలు నడిచాయి. రెండేళ్ల క్రితం మూతబడ్డాయి. గుట్ట చుట్టూ ముళ్ల పొదలు, బండరాళ్లు ఉండటంతో కొందరు గుడుంబా తయూరీ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు. నిర్మానుశ ప్రాంతం కావడంతో ఇక్కడ పేకాటరాయుళ్లు ఆడిందే ఆట. ఇతర జిల్లాల వారుసైతం వచ్చి ఇక్కడ పేకాడతారు. మద్యం బాబులు విందులకు ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటారు. ఇక్కడ ఏం జరిగినా, ఎంత అరిచినా ఎవ్వరికి కనబడదు.. వినపడదు. ఒకప్పుడు మావోయిస్టులకు ఆశ్రయమిచ్చిన ఈ గుట్ట ప్రస్తుతం ఆసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. ఆరో నంబర్ మైలురారుుకి కుడివైపు వంద మీటర్ల దూరంలో ఒకప్పుడు క్వారీ నిర్వాహకులు రేకుల షెడ్డు నిర్మించారు. దీని సమీంపలోనే మరో రేకుల షెడ్డు కట్టించారు. నిర్వాహకులు వెళ్లిపోవడంతో రేకుల షెడ్డు శిథిలావస్థకు చేరుకుంది. దీన్ని కామాంధులు తమకు అడ్డాగా మార్చుకున్నారు. చల్లూరుకు చెందిన యువతిని నోట్‌పుస్తాకాలు ఇస్తానని చెప్పి బలవంతంగా ఈ గుట్ట వద్దకు తీసుకెళ్లి రేకుల షెడ్డులో గొట్టె శ్రీనివాస్, ముద్దం అంజయ్య, ముద్దం రాకేశ్ సామూహికంగా లైంగికదాడి చేశారు.
గతంలో ఎన్నో సంఘటనలు..
ఏడాది క్రితం వరంగల్ జిల్లా హన్మకొండలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ప్రేమజంట ఈ రేకుల షెడ్డులో మాట్లాడుకుంటుండగా ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఆ జంటపై దాడి చేసి బంగారు ఆభరణాలు, డబ్బు ఎత్తికెళ్లారు. హుజూరాబాద్‌కు చెందిన ఓ యువకుడు మానకొండూరుకు చెందిన యువతిని ఇక్కడకు తీసుకువచ్చి లైంగిక దాడికి యత్నిస్తుండగా చుట్టు పక్కల ఉండే రైతులు గమనించి యువకుడిని చితకబాదారు. గతంలో వీణవంకలో పనిచేసిన ఓ ఎస్సై ఈ గుట్ట సమీపంలోని పేకాటస్థావరంపై దాడిచేసి పెద్దు ఎత్తున నగదు పట్టుకున్నారు. అరుుతే ఈ గుట్ట శంకరపట్నం మండల పరిధిలోకి రావడంతో నిందితులు తప్పించుకున్నారు. ఈ గుట్ట చుట్టూ ఎన్నో గుడుంబా తయూరీ కేంద్రాలు ఉన్నారుు. కొందరు యువకులు ఇటీవల మద్యం మత్తులో రోడ్డు వెంట వెళ్లేవారిపై దాడి చేశారు. ఇలాంటి సంఘటనలోన్నో ఇక్కడ జరుగుతున్నాయి.
పట్టించుకోని పోలీసులు..
గుట్ట రెండు మండలాల సరిహద్దులో ఉండటం పోలీసులకు ఇబ్బందిగా మారింది. ఈ గుట్ట పరిసరాలలో ఆసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని కొందరు రైతులు ఇరు పోలీసుస్టేషన్‌లలో ఫిర్యాదులు చేసిన సంఘటనలు ఉన్నాయి. పోలీసులు మాత్రం తమకేం సంబం ధం అన్నట్లు వ్యవహరించడంతో చల్లూరు యు వతిపై కామాంధులు అఘారుుత్యం చేశారు. ఇప్పటికైన ఆసాంఘిక కార్యకలాపాలపై దృష్టిసారించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.
ఏడాదిలో ఐదు లైంగిక దాడులు
ఇందులో రెండు గ్యాంగ్‌రేప్‌లు
వీణవంక : లైంగిక దాడి ఘటనలు వీణవంక మండలంలో పెరుగుతున్నారుు. పోలీసుల నిర్లక్ష్యంతో కామాంధులు రెచ్చిపోతున్నారు. మానవ మృగాలకు కఠిన శిక్షలు పడకపోవడంతో మండలంలో ఏడాది కాలంలో ఐదు అత్యాచార ఘటనలు జరిగాయి. చల్లూరు ఘటనలో సస్పెండ్ అయిన ఎస్సై విదుల్లో చేరినప్పటి నుంచే ఈ ఐదు సంఘటనలు జరిగారుు.
2015, ఏప్రిల్ 6న నర్సింగాపూర్ గ్రామంలో ఓ విద్యార్థిని(16)పై అదే గ్రామానికి చెందిన ఉయ్యాల శ్రీనివాస్ అనే యువకుడు లైంగికదాడి చేశాడు. 2015, మేలో చల్లూరు శివారు గొల్లపల్లి గ్రామంలో ఓ మహిళ(38)పై రాజు అనే వ్యక్తి లైంగికదాడికి యత్నించాడు. చల్లూరు గ్రామంలో 2015, అగస్టు 16న ఓ విద్యార్థిని(15)పై ఇంట్లోనే నీలం రమేశ్ అనే యువకుడు లైంగికదాడి చేశాడు. ఇది అప్పట్లో సంచలనమైంది. మల్లారెడ్డిపల్లి గ్రామంలో 2015, సెప్టెంబర్ 21న మతిస్థిమితంలేని యువతి(20)పై నిమ్మల కుమారస్వామి, పూదరి మొండయ్య, నిమ్మల కళ్యాణ్, దూలం శ్రీనివాస్, నిమ్మల వినోద్ అనే యువకులు నాలుగు నెలలు సామూహిక లైంగికదాడి చేశారు. ఈ నెల 10న చల్లూరుకు చెందిన యువతి(22)పై సామూహిక లైంగికదాడి జరిగింది. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు.