ముజఫర్నగర్ అల్లర్లలో కేవలం దోపిడీలు, గృహదహనాలు మాత్రమే కాదు.. సామూహిక అత్యాచారాలు కూడా జరిగాయట!!
ముజఫర్నగర్ అల్లర్లలో కేవలం దోపిడీలు, గృహదహనాలు మాత్రమే కాదు.. సామూహిక అత్యాచారాలు కూడా జరిగాయట!! ఈ విషయమై ఆ జిల్లాలోని ఫుగనా గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. అల్లర్ల సమయంలో తమ ఇళ్లను కాల్చేశారని, తమపై సామూహిక అత్యాచారాలు చేశారని ఇన్నాళ్ల తర్వాత వాళ్లు బయటకొచ్చి చెప్పారు.
ఈ మేరకు వాళ్లు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అల్లర్లలో పాల్గొన్నవాళ్లు తమ ఇళ్ల మీదకు వచ్చి దాడి చేశారని కూడా చెప్పినట్లు అదనపు ఎస్పీ (రూరల్) అలోక్ ప్రియ దర్శి తెలిపారు. ఈ దారుణానికి గాను 17 మందిపై పోలీసులు మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో జరిగిన మత ఘర్షణలలో దాదాపు 49 మంది ప్రాణాలు పోగా, 40 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.