రామకృష్ణాపూర్(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌లో ఓ యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఈ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రామకృష్ణాపూర్‌లోని శిశుమందిర్ పాఠశాల ఆవరణలో దుర్గంధం రావడంతో స్థానికులు ఆరా తీశారు. ప్రహరీ పక్కన ఉన్న పొదల్లో కుళ్లిన స్థితిలో మృతదేహం కనిపించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్థానిక భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన సుద్దాల శైలజ (24)గా గుర్తించారు. ఈ నెల 22న రాత్రి బహిర్భూమి కోసం వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. తల్లిదండ్రులు సుద్దాల వెంకటి, జమున వెతికినా ఆచూకీ లేకపోవడంతో తమ కూతురు కనిపించడంలేదని 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శైలజ మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండడంతో పోలీసులను మంచిర్యాల ప్రభుత్వాస్పత్రి వైద్యులను పిలిపించి అక్కడే పోస్టుమార్టం చేశారు. ప్రభుత్వ వైద్యులు డాక్టర్ నీలకంఠేశ్వరావు, డాక్టర్ నీరజ నేతృత్వంలో వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. హత్యకు ముందు హతురాలిపై నిందితులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారని ధ్రువీకరించారు. పాఠశాలలోని ఓ తరగతి గదిలో అత్యాచారం జరిపి చెట్ల పొదల్లో పడేసినట్లు సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తోంది. తరగతి గది నుంచి పొదల వరకు రక్తపు మరకలు ఉండడం గమనార్హం. కాగా, శైలజ గతంలో ఇదే పాఠశాలలో విద్యాబోధన చేసింది. అదే పాఠశాలలో హత్యాచారానికి గురవడం గమనార్హం. నిందితులు ముగ్గురు, నలుగురు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సామూహిక అత్యాచారం ... హత్య
Published Fri, Sep 25 2015 10:23 PM | Last Updated on Sun, Sep 3 2017 9:58 AM
Advertisement
Advertisement