Bhagathsingh Nagar
-
వ్యక్తి ఆత్మహత్య
రామయ్య, భగత్‌సింగ్‌నగర్, కడప నగరం ఽకడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీసుస్టేషన్ పరిధి భగత్‌సింగ్‌నగర్‌లో నివసిస్తున్న రామయ్య (31) అనే వ్యక్తి సోమవారం సాయంత్రం తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామయ్య భార్య దేవకుమారికి ఇరువురు సంతానం ఉన్నారు. దేవకుమారి రిమ్స్‌లో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు ఏడు నెలలుగా రావాల్సిన వేతనంలో మూడు నెలల వేతనాన్ని రెండు రోజుల కిందట అందజేశారు. ఆ డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆమె బయట సామాన్లు కడుగుతుండగా ఇంటిలో తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామయ్య అప్పుడప్పుడు మద్యానికి బానిసగా మారి భార్యతో గొడవ పడుతుండేవాడని, వారిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా రామయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాలూకా ఎస్ఐ–2 వెంకట రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
సామూహిక అత్యాచారం ... హత్య
రామకృష్ణాపూర్(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్లో ఓ యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఈ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రామకృష్ణాపూర్‌లోని శిశుమందిర్ పాఠశాల ఆవరణలో దుర్గంధం రావడంతో స్థానికులు ఆరా తీశారు. ప్రహరీ పక్కన ఉన్న పొదల్లో కుళ్లిన స్థితిలో మృతదేహం కనిపించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్థానిక భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన సుద్దాల శైలజ (24)గా గుర్తించారు. ఈ నెల 22న రాత్రి బహిర్భూమి కోసం వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. తల్లిదండ్రులు సుద్దాల వెంకటి, జమున వెతికినా ఆచూకీ లేకపోవడంతో తమ కూతురు కనిపించడంలేదని 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. శైలజ మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండడంతో పోలీసులను మంచిర్యాల ప్రభుత్వాస్పత్రి వైద్యులను పిలిపించి అక్కడే పోస్టుమార్టం చేశారు. ప్రభుత్వ వైద్యులు డాక్టర్ నీలకంఠేశ్వరావు, డాక్టర్ నీరజ నేతృత్వంలో వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. హత్యకు ముందు హతురాలిపై నిందితులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారని ధ్రువీకరించారు. పాఠశాలలోని ఓ తరగతి గదిలో అత్యాచారం జరిపి చెట్ల పొదల్లో పడేసినట్లు సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తోంది. తరగతి గది నుంచి పొదల వరకు రక్తపు మరకలు ఉండడం గమనార్హం. కాగా, శైలజ గతంలో ఇదే పాఠశాలలో విద్యాబోధన చేసింది. అదే పాఠశాలలో హత్యాచారానికి గురవడం గమనార్హం. నిందితులు ముగ్గురు, నలుగురు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
భగత్ సింగ్ నగర్ లో కార్డన్ సెర్చ్
హైదరాబాద్: సరూర్ నగర్ లోని భగత్ సింగ్ నగర్ లో ఎల్బీనగర్ డీసీపీ ఇక్బాల్ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ లో డీసీపీ ఇక్బాల్, మరో 250 మంది పోలీసులు పాల్గొన్నారు. సర్చ్ లో భాగంగా పోలీసులు కాలనీ మొత్తం తనిఖీలు నిర్వహించారు.