రామయ్య, భగత్‌సింగ్‌నగర్, కడప నగరం
ఽకడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీసుస్టేషన్ పరిధి భగత్‌సింగ్‌నగర్‌లో నివసిస్తున్న రామయ్య (31) అనే వ్యక్తి సోమవారం సాయంత్రం తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామయ్య భార్య దేవకుమారికి ఇరువురు సంతానం ఉన్నారు. దేవకుమారి రిమ్స్‌లో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు ఏడు నెలలుగా రావాల్సిన వేతనంలో మూడు నెలల వేతనాన్ని రెండు రోజుల కిందట అందజేశారు. ఆ డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆమె బయట సామాన్లు కడుగుతుండగా ఇంటిలో తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామయ్య అప్పుడప్పుడు మద్యానికి బానిసగా మారి భార్యతో గొడవ పడుతుండేవాడని, వారిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా రామయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాలూకా ఎస్‌ఐ–2 వెంకట రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
Published Mon, Jan 23 2017 11:11 PM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM
Advertisement
Advertisement