రసవత్తరంగా వెటరన్ క్రికెట్ పోటీలు
– సెమీస్‌లో సత్తాచాటిన హైదరాబాద్, విజయవాడ జట్లు
– నేడు ఫైనల్ మ్యాచ్
కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని కేఎస్‌ఆర్‌ఎం, కేఓఆర్‌ఎం క్రీడామైదానాల్లో నిర్వహిస్తున్న ఎం.చంద్రశేఖరరెడ్డి స్మారక వెటరన్ క్రికెట్ టోర్నమెంట్ రసవత్తరంగా సాగుతోంది. శనివారం ఉదయం లీగ్ మ్యాచ్‌లు నిర్వహించగా, మధ్యాహ్నం సెమీఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించారు. ఇందులో విజేతలుగా నిలిచిన హైదరాబాద్, విజయవాడ జట్లు ఆదివారం ఫైనల్‌మ్యాచ్‌లో తలపడనున్నాయి.
కేఎస్‌ఆర్‌ఎం క్రీడామైదానంలో..
కేఎస్‌ఆర్‌ఎం క్రీడామైదానంలో ఉదయం గుంటూరు, గోవా జట్ల మధ్య లీగ్ మ్యాచ్ నిర్వహించారు. టాస్ గెలిచిన గుంటూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన గుంటూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గోవా జట్టు 19 ఓవర్లలో 163 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో గుంటూరు జట్టు 8 వికెట్ల తేడాతో గోవా జట్టుపై విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరింది.
కేఓఆర్‌ఎం క్రీడామైదానంలో..
కేఓఆర్‌ఎం క్రీడామైదానంలో ఉదయం నిర్వహించిన మరో లీగ్ మ్యాచ్‌లో అనంతపురం, హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన అనంత జట్టు బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు 14.4 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 132 పరుగుల విజయలక్ష్యం చేరుకుని ఘనవిజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది.
గుంటూరుపై హైదరాబాద్ విజయం..
కేఎస్‌ఆర్‌ఎం క్రీడామైదానంలో మధ్యాహ్నం నిర్వహించిన సెమీఫైనల్–1లో గుంటూరు, హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన గుంటూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుని 19 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసి విజయం సాధించి ఫైనల్‌లోకి ప్రవేశించింది.
కడపపై విజయవాడ విజయం..
కేఓఆర్‌ఎం క్రీడామైదానంలో మధ్యాహ్నం నిర్వహించిన సెమీఫైనల్–2లో కడప, విజయవాడ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 19.5 ఓవర్లలో 185 పరుగులు చేసింది. జట్టులోని శ్రీకాంత్‌రెడ్డి 55, ఖాజామైనుద్దీన్ 50, వేణుగోపాల్ 30 పరుగులు చేశారు. విజయవాడ బౌలర్లు బాపిరాజు 4, శశిరెడ్డి 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విజయవాడ జట్టు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులోని జనార్దన్ 83 నాటౌట్, లెనిన్ 51 పరుగులు నాటౌట్‌గా నిలిచారు. కడప బౌలర్లు భరత్ 1, జైనుల్లా 1 వికెట్ తీశారు. కడప జట్టుపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విజయవాడ జట్టు ఫైనల్‌లోకి ప్రవేశించింది.