అంతర్‌ జిల్లా ఫెన్సింగ్‌ పోటీలకు వైవీయూ క్రీడాకారులు | YVU players in the inter-district competitions in fencing | Sakshi

అంతర్‌ జిల్లా ఫెన్సింగ్‌ పోటీలకు వైవీయూ క్రీడాకారులు

Published Mon, Dec 19 2016 7:21 PM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM

అంతర్‌ జిల్లా ఫెన్సింగ్‌ పోటీలకు వైవీయూ క్రీడాకారులు

అంతర్‌ జిల్లా ఫెన్సింగ్‌ పోటీలకు వైవీయూ క్రీడాకారులు

కడప స్పోర్ట్స్‌ : ప్రకాశం జిల్లా మార్టూరులో ఈనెల 22 నుంచి నిర్వహించే అంతర్‌ జిల్లా ఫెన్సింగ్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టుకు వైవీయూ ఎంపీఈడీ విద్యార్థులు ఎంపికయ్యారు. ఈనెల 18వ తేదీన రాయచోటిలో నిర్వహించిన ఫెన్సింగ్‌ జిల్లా స్థాయి పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపికచేశారు. వైవీయూలో ఎంపీఈడీ చదువుతున్న బి. వెంకటేష్, కె. సురేష్, తిరుమలయ్య, నరేంద్ర, కె. విశ్వనాథ్, నాగరాజు, బి.మల్లికార్జున, ఆర్‌.ప్రసాద్‌ అంతర్‌ జిల్లా పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. వీరిని వైవీయూ క్రీడాబోర్డు కార్యదర్శి డా. కె.రామప్రసాద్‌రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో వ్యాయామవిద్య విభాగం అకడమిక్‌ కన్సల్టెంట్‌ డా. టి.వి.బి.కృష్ణారెడ్డి, సాయికృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement