పంద్రాగస్టు వేడుకలకు వెళ్లొస్తుంటే దారుణం | Minor Raped While Returning From School Independence Day Celebrations | Sakshi
Sakshi News home page

పంద్రాగస్టు వేడుకలకు వెళ్లొస్తుంటే దారుణం

Published Wed, Aug 17 2016 11:50 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

Minor Raped While Returning From School Independence Day Celebrations

చండీగఢ్: హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరై వస్తున్న పన్నెండో తరగతి విద్యార్ధినిపై సామూహిక లైంగిక దాడి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం హర్యానాలోని కియోరా అనే గ్రామానికి చెందిన పన్నెండో తరగతి విద్యార్థిని తన పాఠశాలలో పంద్రాగస్టు వేడుకలకు హాజరై తిరిగొస్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అడ్డగించారు.

బైక్ కు కొద్ది దూరంలో మరో ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చారు. ఆ తర్వాత అందరూ కలిసి ఆ అమ్మాయిని కత్తితో బెదిరించి ఎత్తుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. కిడ్నాప్ చేసిన ప్రాంతం నుచి టిక్ అనే గ్రామంలోని ఓ ఇంట్లో వాళ్లు ఆకృత్యానికి దిగారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement