
మహిళపై సామూహిక లైంగిక దాడి
థానే: బంధువుల ఇంటికి వెళుతున్న ఓ మహిళను అడ్డుకుని ఇద్దరు వ్యక్తులు ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కాసర అనే గ్రామానికి చెందిన 21 ఏళ్ల మహిళ వాడిలోని తమ బంధువుల ఇంటికి వెళ్లేందుకు బయలు దేరింది. దేవుల్ అనే రైల్వే స్టేషన్కు వెళ్లే క్రమంలో రైలు పట్టాల వెంట ఆమె నడుస్తుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి అడ్డుకున్నారు.
అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. వారి నుంచి బాధితురాలు తప్పించుకొని సాయంత్రం వేళకు ఇంటికి చేరుకోగలిగింది. అనంతరం జరిగిన ఘటనను తల్లిదండ్రులకు వివరించింది. దీంతో పోలీసులు రమేశ్ శాబ్లే (22) అనే వ్యక్తిని ఇప్పటికే అదుపులోకి తీసుకోగా.. సచిన్ వాసవే అనే వ్యక్తికోసం మాత్రం తీవ్రంగా గాలింపులు జరిపి పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చింది. గత వారం రోజులుగా మహారాష్ట్రలో వరుసగా అత్యాచారాలు జరుగుతున్నాయి.