16 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులు రాన్ సింగ్ (65), శ్రీభగవాన్ (44)లకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యూఢిల్లీ అడిషనల్ సెషన్స్ జడ్జ్ ఎం.సి.గుప్తా తీర్పు వెలువరించారు. అంతేకాకుండా ఒకొక్కరికి రూ. 30 వేల జరిమాన విధించారు. ఉద్యోగం పేరుతో బాలికకు రప్పించి ఆమెపై అత్యాచారం చేయడం హేయమైన చర్యగా జడ్జి అభివర్ణించారు. నిందితులలో రాన్ సింగ్ ఓ కంపెనీలో గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు.
ఉద్యోగం ఇప్పిస్తానని బంధువుల అమ్మాయికి భరసా ఇచ్చాడు. అందుకోసం న్యూఢిల్లీ వస్తే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. ఆ క్రమంలో ఆ యువతి న్యూఢిల్లీలోని రాన్ సింగ్ రూమ్కు వెళ్లింది. దాంతో ఉద్యోగంపై మరో వ్యక్తితో మాట్లాడాలని చెప్పి ఆ యువతిని కారులో ఫామ్ హౌస్కు తీసుకువెళ్లాడు. అక్కడ సింగ్తోపాటు, మరో వ్యక్తి శ్రీభగవాన్ యువతిపై అత్యాచారం జరిపారు.
దాంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో పోలీసులు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. ఘటనపై విచారణ జరిపిన కోర్టు శనివారం శిక్షను ఖరారు చేసింది. 2003, డిసెంబర్ 6న యువతిపై అత్యాచార ఘటన చోటు చేసుకుంది.