నర్మెట్ట: వరంగల్ జిల్లా నర్మెట్ట మండలం దొమ్మాకూర్‌లో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముగ్గురు వ్యక్తులు 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయగా... బుధవారం బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దొమ్మాకూర్ గ్రామానికి చెందిన మాలోతు శ్రీకాంత్, మాలోతు రూప్‌లా, భూక్యా బాలు ఈ నెల 16న బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డారు. గ్రామంలో పెద్ద మనుషుల వద్ద పరిష్కారం కోసం జరిపిన చర్చలు విఫలం కావడంతో బాలిక తల్లిదండ్రులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి, భూక్యా బాలును అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.