కోల్‌కతాలోని బాబూఘాట్-ఖిద్దేర్‌పూర్ ప్రాంతంలో 21 ఏళ్ల యువతిని లారీలోకి తీసుకెళ్లి, ఆమెపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
కోల్‌కతా: కోల్‌కతాలోని బాబూఘాట్-ఖిద్దేర్‌పూర్ ప్రాంతంలో 21 ఏళ్ల యువతిని లారీలోకి తీసుకెళ్లి, ఆమెపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరిని సోమవారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. మాదకద్రవ్యాలకు బానిసైన మహమ్మద్ హమీద్ అలియాస్ రాజా అనే నిందితుడిని అరెస్టు చేశామని, అతడు నేరాన్ని అంగీకరించాడని కోల్‌కతా పోలీసు కమిషనర్ ఎస్.కె.పురకాయస్థ చెప్పారు. విషమ పరిస్థితిలో ఆస్పత్రికి చేరిన బాధితురాలి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశాలపై బాధితురాలిని కోల్‌కతాలోని సూపర్ స్పెషాలిటీ ప్రైవేటు ఆస్పత్రి బెల్లె వ్యూ క్లినిక్‌కు తరలించారు.