
సామూహిక లైంగిక దాడి.. నిప్పు
నోయిడా: పదో తరగతి చదువుతున్న బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం నిప్పు అంటించడంతో ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. నోయిడాలోని జవర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం లోకేంద్ర, ప్రదీప్, సోను, లోకేంద్ర భార్య అర్చనా అనే వ్యక్తులు ఈ కేసులో నిందితులు. ముందునుంచే వీరికి చెడు అలవాట్లుఉన్నాయని, గతంలో కొంతమంది అమ్మాయిలతో న్యూడ్ వీడియోలు తీసేవారని, బాలికను కూడా ఏడు నెలలుగా అలాంటి పనికే బలవంతపెట్టారని, కానీ, ఆ అమ్మాయి తల్లిదండ్రులతో చెప్పడంతో వారు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు.
కాగా, బాధితురాలు బంధువు మాత్రం ఇప్పటికే వాళ్లు అమ్మాయికి తెలియకుండా ఓ ఎంఎంఎస్ తయారు చేసి రూ.ఐదువేల చొప్పున రెండు సార్లు వసూలు చేశారని తెలిపారు. చివరికి మళ్లీ అలాంటి వేధింపులకే పాల్పడ్డారని, ఈ విషయం ఎన్నిసార్లు పోలీసులకు చెప్పినా.. నిందితులకు రాజకీయ అండదండలు ఉండటంతో వారు పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు.