అక్కను కట్టేసి.. చెల్లెలిపై దారుణం | Teenage girl gangraped | Sakshi
Sakshi News home page

అక్కను కట్టేసి.. చెల్లెలిపై దారుణం

Published Wed, Oct 5 2016 3:54 PM | Last Updated on Mon, Apr 8 2019 6:21 PM

అక్కను కట్టేసి.. చెల్లెలిపై దారుణం - Sakshi

అక్కను కట్టేసి.. చెల్లెలిపై దారుణం

బదాన్: ఉత్తరప్రదేశ్లోని బదాన్ జిల్లా సహస్వాన్ ప్రాంతంలో ఐదుగురు దుండగులు ఓ మైనర్ అమ్మాయిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

సోమవారం బాధిత బాలిక (14) తన అక్కతో కలసి ఓ వివాహ వేడుకకు వెళ్లింది. నిందితులు వీరిద్దరిని కిడ్నాప్ చేసి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. దుండగులు బాధిత బాలిక అక్కను కట్టేసి, ఆమెపై దారుణానికి పాల్పడినట్టు బద్నాన్ ఎస్పీ సంజయ్ రాయ్ చెప్పారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నామని ఎస్పీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement