
గ్యాంగ్ రేప్ చేసి.. నిప్పు పెట్టారు
ఉత్తరప్రదేశ్లోని ఘజిపూర్ జిల్లాలో ముగ్గురు దుండగులు ఓ దళిత బాలిక (14)పై సామూహిక అత్యాచారం చేసి నిప్పు పెట్టారు.
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఘజిపూర్ జిల్లాలో ముగ్గురు దుండగులు ఓ దళిత బాలిక (14)ను సామూహిక అత్యాచారం చేసి, నిప్పు పెట్టి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రం ఆస్పత్రికి తరలించారు.
7వ తరగతి చదువుతున్న ఈ అమ్మాయి శుక్రవారం స్వగ్రామం నుంచి దగ్గరలోని శివన్ పట్టణానికి వెళ్లేందుకు బయల్దేరింది. ఊరు దాటిన తర్వాత ముగ్గురు యువకులు ఆమెను బలవంతంగా చెరుకుతోటలోకి లాక్కెళ్లి దారుణానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి ఒంటిపై కిరోసిన్ పోసి అంటించి పరారయ్యారు. బాధితురాలు సాయం చేయాల్సిందిగా కేకలు వేస్తూ చెరుకుతోటలో నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోయింది. స్థానికులు ఆమెను గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.