విద్యార్థినిపై ఆరుగురు సామూహిక అత్యాచారం | Girl gangraped by six | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై ఆరుగురు సామూహిక అత్యాచారం

Published Wed, Sep 17 2014 4:38 PM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM

విద్యార్థినిపై ఆరుగురు సామూహిక అత్యాచారం

విద్యార్థినిపై ఆరుగురు సామూహిక అత్యాచారం

వారణాసి: ఆరుగురు వ్యక్తులు ఓ విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. ఉత్తరప్రదేశ్లోని చాందౌలి జిల్లా ఇల్లియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 9న ఈ ఘటన జరిగింది. ఎస్పి మునిరాజ్ కథనం ప్రకారం ప్లస్ టు చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని స్కూల్ కు వెళుతుండగా ఆరుగురు వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు.

ఆ తరువాత నిందితులు ఆ విద్యార్థినిని అలహాబాద్ తీసుకువెళ్లారు. అక్కడ ఆ బాలికను నిర్బంధంలో ఉంచి ఆరుగురు సామూహికంగా అత్యాచారం చేశారు. ఆ విధంగా వారు ఆరు రోజులపాటు అలా చేశారు. ఆ తరువాత ఆ బాలికను వారు వారణాసి తీసుకువచ్చి రైల్వే స్టేషన్ వద్ద వదిలిపెట్టినట్లు ఎస్పి చెప్పారు.

నిందితులలో ఒకడు బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లారు. బాలికను తీసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఆ ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement