మహబూబ్‌నగర్: ఓ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు ముగ్గుర్నీ మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివారల ప్రకారం... మండలంలోని పెంట్లవల్లికి చెందిన పద్నాలుగేళ్ల బాలిక అదే గ్రామానికి చెందిన సంపంగి రామకృష్ణ (17) ప్రేమించుకుంటున్నారు.
ఈ క్రమంలో శనివారం రాత్రి రామకృష్ణ తాను ప్రేమిస్తున్న బాలికను గ్రామంలోని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తర్వాత తన స్నేహితులు పల్లె ప్రకాశ్, రాజేష్‌లను పిలిపించగా వారు కూడా ఆమెపై అత్యాచారం చేశారు. దీనిపై బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రామకృష్ణ, ప్రకాశ్, రాజేష్‌లను అరెస్ట్ చేసి వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.