
భర్తను కొట్టి.. భార్యపై గ్యాంగ్ రేప్, హత్య
పాల్గఢ్: నలుగురు దుండుగులు భర్తను చితకబాది, భార్యపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. మహారాష్ట్రలోని పాలగఢ్ జిల్లా వలీవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ సంఘటన జరిగింది.
ఈ నెల 21వ తేదీ రాత్రి నలుగురు దుండగులు వివాహిత ఇంటికి వెళ్లారు. ఆమె తమను దుర్భాషలాడిందని, ఆమెను రేప్ చేస్తామని భర్తకు చెప్పారు. దుండగులు భర్తను కొట్టి, ఆమెను ఇంట్లోంచి లాక్కెళ్లారు. నిందితులు ఆమెపై లైంగికదాడి చేసి, అనంతరం చంపేశారు. ఆమె శవాన్ని ఓ కాలువలో పడేసి వెళ్లిపోయారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.