ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో అకృత్యాల జాబితా ఒక్కొక్కటిగా వెలుగుచూస్తోంది.
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో అకృత్యాల జాబితా ఒక్కొక్కటిగా వెలుగుచూస్తోంది. తమ ఇళ్లను తగలబెట్టి, తమపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు నిన్ననే ముగ్గురు మహిళలు పోలీసులకు ఫిర్యాదుచేయగా, ఇప్పుడు తాజాగా మరో ఇద్దరు కూడా ముందుకొచ్చారు. వీళ్లు కూడా ఫుగనా గ్రామానికి చెందినవాళ్లే. నలుగురు వ్యక్తులు తమపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు వీళ్లు ఫిర్యాదుచేశారని ఎస్ఎస్పీ హెచ్ఎన్ సింగ్ తెలిపారు.
అల్లర్లు తీవ్రంగా ఉండటంతో గ్రామం వదిలిపెట్టి పారిపోయిన ఈ బాధితులు.. చాలాకాలం తర్వాత తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. తిరిగి వచ్చేసరికి తమ ఇళ్లన్నీ సర్వ నాశనం అయిపోయాయని వారు వాపోయారు. ముజఫర్ నగర్, పరిసర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో 62 మంది మరణించగా, కొన్ని వేల మంది నిరాశ్రయులైన విషయం తెలిసిందే.