వివాహితపై కామాంధుల సామూహిక అత్యాచారం.. స్పృహ కోల్పోయి | Married Woman Molesttation in Mysore | Sakshi

వివాహితపై కామాంధుల సామూహిక అత్యాచారం.. స్పృహ కోల్పోయి

Apr 16 2022 7:34 AM | Updated on Apr 16 2022 7:34 AM

Married Woman Molesttation in Mysore - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

వివాహితపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 35 సంవత్సరాల వయసున్న బాధితురాలు ఈనెల 11న గొర్రెలను తీసుకొని మేతకు వెళ్లింది. అక్కడ తొలుత రాజు అనే నిందితుడు ఆమెపై బలత్కారానికి యత్నించాడు.

సాక్షి, మైసూరు: మైసూరు జిల్లా నంజనగూడు తాలూకాలో ఒక వివాహితపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 35 సంవత్సరాల వయసున్న బాధితురాలు ఈనెల 11న గొర్రెలను తీసుకొని మేతకు వెళ్లింది. అక్కడ తొలుత రాజు అనే నిందితుడు ఆమెపై బలత్కారానికి యత్నించాడు. ఆమె తీవ్రంగా అడ్డుకుంది. అనంతరం అక్కడే ఉన్న పుట్టణ్ణ, రవిలు రాజుకు తోడయ్యారు. అనంతరం ముగ్గురూ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు.

పశువుల్లా మీదపడి అకృత్యానికి పాల్పడటంతో ఆమె స్పృహ కోల్పోయింది. గొర్రెల మంద ఇంటికి వచ్చినా భార్య రాకపోవడంతో భర్త వెళ్లి పరిశీలించారు. అస్వస్థతకు గురైన ఆమెను మైసూరులోని కేఆర్‌ ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న అనంతరం ఆ రోజు జరిగిన ఉదంతాన్ని భర్తకు వివరించింది. మరుసటి రోజు భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టి  నిందితుడు రాజును శుక్రవారం అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. 

చదవండి: (మహిళా డాక్టర్‌పై సామూహిక అత్యాచారం.. రూ.40వేలు డబ్బులు డ్రా చేయించి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement