Vijayawada Crime News: Man Molested on Married Woman in Vijayawada - Sakshi
Sakshi News home page

Crime News: వివాహితను ఇంట్లో నిర్బంధించి లైంగికదాడి.. రెండు రోజుల తర్వాత..

Published Thu, Jun 2 2022 3:26 PM | Last Updated on Thu, Jun 2 2022 7:09 PM

Man Molested On Married Woman In Vijayawada - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చిట్టినగర్‌(విజయవాడ పశ్చిమ): సెల్‌ఫోన్‌ షాపులో పని చేసే వివాహితకు మాయమాటలు చెప్పి నిర్బంధించి పలుమార్లు లైంగికదాడికి  పాల్పడిన వ్యక్తిపై కొత్తపేట పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం జక్కంపూడి వైఎస్సార్‌ కాలనీకి చెందిన బాధితురాలికి  8 ఏళ్ల కిందట వివాహమైంది. ఆమె  శ్రీనివాస మహల్‌ సమీపంలోని ఒక మొబైల్‌ షాపులో పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో వివాహిత గత నెల 5వ తేదీన కనిపించకుండా పోయింది. తన భార్య కనిపించడం లేదంటూ ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చదవండి: అమ్మాయి కోసం స్నేహితుల మధ్య గొడవ.. చివరికి ఎంత దారుణం జరిగిందంటే?

రెండు రోజుల తర్వాత వివాహిత ఇంటికి రాగా ఎక్కడకు వెళ్లావని భర్త ప్రశ్నించాడు. అయితే  ఏం జరిగిందో  చెప్పకపోవడంతో సరే.. మానసిక పరిస్థితి సరిగా లేదని ఏమీ అనకుండా మిన్నకున్నాడు. అయితే గత రెండు రోజులుగా మానసికంగా మరీ కుంగిపోతుండటంతో ఏం జరిగిందని నిలదీశాడు. దీంతో తాను పనిచేసే మొబైల్‌ షాపులో తనతో పాటు పని చేసే టీం లీడర్‌ రమేష్‌బాబు తనను రెండు రోజుల పాటు  పటమటలోని  ఓ ఇంటికి తీసుకువెళ్లి మాయమాటలు చెప్పి పలు మార్లు లైంగికదాడికి పాల్పడినట్లు ఏడుస్తూ  చెప్పింది. లైంగిక దాడి  చేసిన విషయం బయటకు చెప్పకుండా ఉండేందుకు తన మెడలో తాళి కూడా కట్టాడంటూ తెలియజేసింది. గత నెల  7వ తేదీన తనను నిర్బంధించిన ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని తప్పించుకుని వచ్చేశానని చెప్పింది. భర్త కరిముల్లా ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement